Take a fresh look at your lifestyle.

సీపీఆర్ నేర్చుకుంటే 50 శాతం మందిని బతికించొచ్చు 

0 30

సీపీఆర్ నేర్చుకుంటే 50 శాతం మందిని బతికించొచ్చు 

: మంత్రి హరీష్ రావు

సిద్ధిపేట, ఏప్రిల్ 10 : సీపీఆర్ నేర్చుకుంటే 50 శాతం మందిని బతికించొచ్చు. కార్డియాక్ అరెస్టుతో స్పృహ కోల్పోయిన వ్యక్తులను తిరిగి స్పృహలోకి తెచ్చేందుకు సీపీఆర్ విధానం ఎంతో అవసరమని, దేశ వ్యాప్తంగా 2 శాతం మందికి మాత్రమే సీపీఆర్ పై అవగాహన ఉన్నదని, సీపీఆర్ నేర్చుకుని ప్రతి ప్రాణాన్ని కాపాడదామని రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు పిలుపునిచ్చారు.

జిల్లా కేంద్రమైన సిద్ధిపేట పోలీసు కన్వెన్షన్ హాల్ లో ఆదివారం ఉదయం ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులకు వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో సీపీఆర్ పై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన మంత్రి జ్యోతి ప్రజ్వలన చేసి శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ మేరకు సిద్ధిపేట జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్ లు మంత్రి సమక్షంలో స్వయంగా సీపీఆర్ చేసి ప్రాముఖ్యతను వివరించారు. కాగా ఇటీవల సీపీఆర్ చేసి విలువైన ప్రాణాలు కాపాడిన 108 సిబ్బందిని మంత్రి ఘనంగా సన్మానించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking