Take a fresh look at your lifestyle.

విశాఖలో ఈనెల 25వ తేదీన  పెద్ద ఎత్తున బిసి గర్జన

0 15

విశాఖలో ఈనెల 25వ తేదీన  పెద్ద ఎత్తున బిసి గర్జన

హైదరాబాద్ జూన్ 8: చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కేటాయించాలంటూ జాతీయ స్థాయిలో జరుగుతున్నటువంటి ఉద్యమాలలో భాగంగా విశాఖలో ఈనెల 25వ తేదీన  పెద్ద ఎత్తున బిసి గర్జన కార్యక్రమం చేపట్టినట్టుగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య తెలిపారు.

ఈరోజు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధికార ప్రతినిధి ఢిల్లీ ఇన్చార్జి కర్రి వేణుమాధవ్ అధ్యక్షతన జరిగిన బిసి 34 కులాల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశానికి స్వతంత్రం వచ్చి 75 ఏళ్లయినా 56శాతం జనాభా గల బి.సి.ల డిమాండ్లు పార్లమెంట్ లో చర్చకు రాకపోవడం బాధాకరమని ఈ విషయంపై అన్ని రాజకీయ పార్టీలో ఉన్నటువంటి ఓబీసీ పార్లమెంటు సభ్యులు ఏకతాటిపైకి రావడానికి కృషి చేస్తున్నట్టుగా తెలిపారు.

బి.సి ఉద్యమ విస్తరణలో భాగంగా కర్నాటక, తమిళనాడు, ఆంధ్ర ప్రదేశ్ లో భారీ బహిరంగ సభలు పెట్టి జులైలో ఢిల్లీ పార్లమెంట్ ముట్టడి చేస్తామని తెలిపారు. కర్రీవేణు మాధవ్ జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధికార ప్రతినిధి ఢిల్లీ ఇంచార్జ్ విశాఖ బీసీ గర్జన నిర్వాహకుడు మాట్లాడుతూ 50 సంవత్సరాలు ఉద్యమ నాయకుడికి 2వేలకు G.O లు సాధించి, పేదకులలు చదువుకోవడానికి హాస్టళ్ళు, గురుకుల పాఠశాలలు, ఫీజు రియంబర్స్ మెంట్ స్క్రీములు పెట్టించారన్నారు.

స్థానిక సంస్థలలో బి.సి లకు 34 శాతం రిజర్వేషన్లు పెట్టించినందుకు గుర్తింపుగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు శ్రీ ఆర్ కృష్ణయ్య గారికి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా సమగ్ర కుల గణన  కార్యక్రమానికి శ్రీకారం చుట్టించిన ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ శాఖ మాత్యులు  చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ కి ఇరువురికి స్వర్ణ కంకణ బహుకరణ కార్యక్రమం విశాఖపట్నం ఏయు కన్వర్షన్ హాల్లో జూన్ 25వ తారీఖున ఆదివారం ఏర్పాటు చేసినట్టుగా ఈ కార్యక్రమంలో జాతీయ స్థాయిలోని బీసీ నాయకులు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక తమిళనాడు బీసీ ఉద్యమ ముఖ్య నాయకులు హాజరవుతారని నిర్వాహకులు కర్రి వేణుమాధవ్ తెలిపారు.ఈ సమావేశం లో బిసి సంఘం నాయకులు రాజేందర్, నాని ముదిరాజు, హరిచంద్ర పితాని, మల్లికార్జున్, చిన్నబాబు,తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking