Take a fresh look at your lifestyle.

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో కోమటిరెడ్డి భేటీ

0 17

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో కోమటిరెడ్డి భేటీ

న్యూఢిల్లీ, జూన్ 19 : కేంద్ర రవాణాశాఖ మంత్రి నితీన్ గడ్కరీ తో భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సమావేశమయ్యారు. భువనగిరి పార్లమెంటరీ నియోజకవర్గ సమస్యల గురించి ఇద్దరి మధ్య చర్చ జరిగింది. నియోజకవర్గ సమస్యలను గడ్కరీకి వివరించారు కోమటిరెడ్డి. వెంకట్ రెడ్డి చెప్పిన విషయాలన్నింటినీ కేంద్రమంత్రి సావధానంగా విన్నారు.

హైదరాబాద్-విజయవాడను కలిపే జాతీయ రహదారి 65ని 6 లేన్లుగా మార్చాలని గడ్కరీని కోరారు వెంకట్ రెడ్డి. గుర్తించబడిన 17 బ్లాక్ స్పాట్ ల మరమ్మతు పనులను యుద్ధప్రాతిపదికన వేగవంతం చేయాలని అభ్యర్థించారు. జాతీయ రహదారి 65పై వాహనాల రద్దీ బాగా పెరిగింది. దానివల్ల నిత్యం ఎక్కడో ఒకచోట ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎన్నో కుటుంబాలు రోడ్డునపడుతున్నాయి.

ఈ నేపథ్యంలో ప్రమాదాలను తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని మూడేళ్లుగా ప్రధాని మోడీ గారిని, కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ గారిని కలిసి పలుమార్లు వినతిపత్రాలు అందించారు కోమటిరెడ్డి. జాతీయ రహదారి 65ను 6 లేన్లుగా మార్చే పనులను రాబోయే 2 నెలల్లోగా ప్రారంభిస్తామని.. ఈ సందర్భంగా గడ్కరీ హామీ ఇచ్చారు. బ్లాక్ స్పాట్స్ మరమ్మతు పనులు కూడా వేగవంతం చేస్తామని ఇప్పటికే టెండర్లకు పిలిచినట్లు చెప్పారు..

Leave A Reply

Your email address will not be published.

Breaking