Take a fresh look at your lifestyle.

కవిత ఈడీకి రాసిన లేఖలో  కీలక విషయాలు

0 336

కవిత ఈడీకి రాసిన లేఖలో  కీలక విషయాలు

చట్టాలు అందరికి చుట్టమే.. కానీ..

ఢిల్లీ, మార్చి 16 : కవిత ఈడీకి రాసిన లేఖలు పలు కీలక విషయాలను ప్రస్తావించారు. ముఖ్యంగా.. ‘మహిళలను ఆఫీస్‌కు పిలిపించి విచారించకూడదు. ఆడియో, వీడియో విచారణకు నేను సిద్ధంగానే ఉన్నాను. అధికారులు నా నివాసానికి వచ్చి విచారణ చేయవచ్చని ఇదివరకే మీకు చెప్పాను. అయితే నా విజ్ఞప్తిని మీరు అంగీకరించలేదు. ఈడీ కస్టడీలో ఉన్న వ్యక్తులను ఎదురుగాపెట్టి నన్ను ప్రశ్నించాలని చెప్పారు. చట్టప్రకారం నాకు హక్కులు ఉన్నప్పటికీ మీ మాటను అంగీరించి ఈనెల 11న జరిగిన విచారణకు హాజరై పూర్తిగా సహకరించాను.

మీరు (ఈడీ అధికారులు) అడిగిన అన్ని ప్రశ్నలకు నాకు తెలిసిన మేరకు సమాధానాలిచ్చాను. అయినా చట్ట విరద్ధంగా నా ఫోన్‌ను సీజ్ చేశారు. ఈ నేరంతో నా ఫోన్‌కు ఏం సంబంధమో కూడా చెప్పలేదు. మీ చర్య నా వ్యక్తిగత హక్కులకు భంగం కలిగించింది. ఈనెల 11న రాత్రి 8:30 గంటల వరకు ఈడీ కార్యాలయంలోనే ఉంచారు. మళ్లీ విచారణకు రావాలని సమన్లు ఇచ్చారు.

వ్యక్తిగతంగా (In Person) రావాలని మీరు ఇచ్చిన సమన్లలో ఎక్కడా పేర్కొనలేదు. అందుకే మీరు అడిగిన డాక్యుమెంట్లతో నా ప్రతినిధి సోమా భరత్‌ ద్వారా పంపుతున్నాను. ఈడీ విచారణకు పూర్తిగా సహకరిస్తాను. అయితే 11న మీరు మాట తప్పారు. ఈడీ కస్టడీలో ఉన్న వ్యక్తులను ఎదురుగా విచారించడానికే నేను వ్యక్తిగతంగా హాజరుకావాలని చెప్పినా.. అలాంటిదేమీ జరగలేదు.

ఎందుకని నేను అడిగిన ప్రశ్నలకు మా ప్లాన్ మార్చుకున్నామని మీ అధికారులు (ఈడీ అధికారులు) చెప్పారు. దీంతో విచారణ చట్టబద్ధంగా జరగలేదని నేను భావిస్తున్నాను. అందుకే నేను సుప్రీంకోర్టును ఆశ్రయించాను. ఈ పిటిషన్ ఈనెల 24న సుప్రీంకోర్టులో విచారణకు వస్తుంది.

కనుక సుప్రీంకోర్టు (Supreme Court) ఆదేశాలు వచ్చే వరకు ఈడీ సమన్ల విషయంలో వేచి ఉండాలి. ఈడీ ముందు మహిళ విచారణకు హాజరుకావడంపై కూడా పిటిషన్ సుప్రీంకోర్టులో పెండింగ్‌లోనే ఉంది. కనుక తదుపరి ప్రొసీడింగ్స్‌ను సుప్రీంకోర్టు తీర్పు వచ్చేవరకూ వాయిదా వేయమని కోరుతున్నాను. ప్రజాప్రతినిధిగా, ఒక మహిళగా నాకు ఉన్న హక్కులను హరించరాదు’ అని ఈడీకి పంపిన లేఖలో కవిత వివరంగా రాసుకొచ్చారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking