Take a fresh look at your lifestyle.

కశ్మీర్ ఫైల్స్ కు మించి కేరళ స్టోరీ

0 14

కశ్మీర్ ఫైల్స్ కు మించి కేరళ స్టోరీ

హైదరాబాద్, మే 6, సినిమాలు వేరు. రాజకీయాలు వేరు. ఇది పాత మాట. ఇదంతా ఒకప్పటి ముచ్చట. ఇప్పుడు ఈ రెండూ కలిసిపోతున్నాయి. ఓ పార్టీ స్టాండ్ తీసుకుని కొందరు సినిమాలు తీస్తున్నారన్న వాదనలు ఈ మధ్యకాలంలో ఇండస్ట్రీలో పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా కశ్మీర్ ఫైల్స్ సినిమాపై ఎన్ని వివాదాలు జరిగాయో చూశాం. బీజేపీ పని కట్టుకుని ఆ మూవీకి ప్రచారం చేసిందని విపక్షాలు ఆరోపించాయి.

ఇప్పటికీ దీనిపై ఎక్కడో అక్కడో మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఇది సద్దుమణగక ముందే ఇప్పుడు మరో సినిమా..పొలిటికల్ హీట్‌ని పెంచింది. అటు మత పరంగానూ అలజడి రేపుతోంది. అదే ది కేరళ స్టోరీ సినిమా. అదాశర్మ లీడ్‌ రోల్‌లో నటించిన ఈ సినిమా విడుదలకు ముందే సెన్సేషన్ క్రియేట్ చేసింది. లవ్ జిహాద్ (Love Jihadi) కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం విడుదలైంది. కానీ కొన్ని చోట్ల మాత్రం ఈ విడుదలపై నిషేధం విదించారు. కొన్ని థియేటర్లు షోస్ క్యాన్సిల్ చేశాయి. కేరళ ప్రభుత్వమైతే డైరెక్టర్, ప్రొడ్యూసర్‌పై తీవ్రంగా మండి పడుతోంది. మత విద్వేషాలు పెంచొద్దని హెచ్చరించింది. తమిళనాడు హైకోర్టు వరకూ వెళ్లింది ఈ వివాదం.

ఈ సినిమాను బ్యాన్ చేయాలని కొందరు పిటిషన్ వేశారు. కానీ కోర్టు మాత్రం ఆ పిటిషన్‌ని తిరస్కరించింది. ఇలాంటి విషయాల్లో జోక్యం చేసుకోమని తేల్చి చెప్పింది. సుప్రీంకోర్టుకి చేరుకున్నా…అక్కడా చుక్కెదురైంది. ఇలాంటి విషయాల్లో వేలు పెట్టం అని కోర్టు స్పష్టం చేసింది. అటు ముస్లిం సంఘాలు మాత్రం తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నాయి. లవ్ జిహాద్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిందీ మూవీ. హిందూ అమ్మాయిలను ట్రాప్ చేసి ఇస్లాంలోకి మార్చడం. ఆ తరవాత వాళ్లను ఉగ్రవాదులు తయారు చేయడం. ఇదే కథ. ఇందులో లీడ్‌ రోల్‌లో అదాశర్మ కనిపించారు. ఆమెతో పాటు మరో ముగ్గురు నటించారు. వీళ్లందరినీ లవ్ జిహాద్ బాధితులుగా చూపించారు డైరెక్టర్ సుదీప్తో సేన్. ప్రేమ పేరుతో వల వేసి ఇస్లాం రూల్స్ ప్రకారం పెళ్లి చేసుకుంటారు.

ఆ తరవాత అఫ్ఘనిస్థాన్‌కు వెళ్లిపోతారు. అక్కడే ఆ అమ్మాయిలకు ఉగ్రవాదులతో ట్రైనింగ్ ఇస్తారు. ఆ తరవాత అఫ్గాన్ బలగాల చేతులకు చిక్కి ఆ అమ్మాయిలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారనేది ఈ సినిమాలో చూపించారు. బ్రీఫ్‌గా చెప్పాలంటే ఇదీ కథ. యథార్థ సంఘటనల ఆధారంగానే ఈ సినిమా తీశామని డైరెక్టర్ చెబుతున్నా…ఇది పొలిటికల్ టర్న్ తీసుకుంది. కేరళలో భారీ ఎత్తున హిందూ అమ్మాయిలను ట్రాప్ చేసి ఇస్లాం మతంలోకి మార్చుతున్నట్టుగా చూపించడంపై ఆ రాష్ట్ర ప్రభుత్వం భగ్గుమంది. మూవీ డైరెక్టర్‌ చెబుతున్న లెక్కల ప్రకారం దాదాపు 32 వేల మంది అమ్మాయిలు లవ్ జిహాద్‌కి బలి అయ్యారు.

ఈ లెక్కల విషయంలోనూ వివాదం ముదిరింది. తప్పుడు లెక్కలు ప్రచారం చేసి విద్వేషాలు రెచ్చగొడతారా అంటూ ఫైర్ అయింది కేరళ ప్రభుత్వం. పలు చోట్ల షోలు రద్దు చేసింది. సంఘ్ పరివార్‌తో కుమ్మక్కై కొందరు కావాలనే ఈ ప్రచారాలు చేస్తున్నారని కేరళ సీఎం పినరయి విజయన్ ఇప్పటికే తీవ్ర ఆరోపణలు చేశారు. యూట్యూబ్‌లో టీజర్ రిలీజ్ అయినప్పటి నుంచే కేరళ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.

ఈ సినిమా ప్రొడ్యూసర్ విపుల్ అమృత్‌లాల్ షా ఈ వివాదంపై క్లారిటీ ఇచ్చారు. యథార్థ సంఘటనల ఆధారంగానే ఈ సినిమాను తెరకెక్కించామని స్పష్టం చేశారు. 32 వేల మంది అమ్మాయిలు లవ్ జిహాద్‌కి బలి అయ్యారన్న విషయాన్ని మరోసారి తేల్చి చెప్పారు. ఈ లెక్కలకు కట్టుబడి ఉన్నామని వెల్లడించారు. దీంతో ఈ వివాదం మరింత పెరిగింది. అటు కాంగ్రెస్ కూడా ఈ సినిమాపై మండి పడుతోంది. ఎంపీ శశి థరూర్ ఓ ట్వీట్ చేశారు. ఆ డైరెక్టర్ చెబుతున్నట్టుగా అంత మంది అమ్మాయిలు ఇస్లాంలోకి కన్వర్ అయ్యారని నిరూపిస్తే కోటి రూపాయల నజరానా ఇస్తానని ప్రకటించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking