Take a fresh look at your lifestyle.

కేసీఆర్ గారు లీకులుండవని సంతకం చేయండి : వైఎస్ షర్మిల

0 13

కేసీఆర్ గారు లీకులుండవని సంతకం చేయండి : వైఎస్ షర్మిల

హైదరాబాద్, మే 17 :కేసీఆర్, పదవులైనా,.. బతుకైనా అన్నీ తెలంగాణ కోసమే అనే మహా బిల్డప్ ఇస్తారు కదా, – మరి బంగారు తెలంగాణలో బుడగల్లా పేలిపోతున్న యువత భవిత కోసం ఈ అఫిడవిట్ మీద మీ బంగారు సంతకం పెట్టండని వైఎస్సార్ తెలంగాణా పార్టీ అధినేత్రి షర్మిల అన్నారు. టీఎస్పిఎస్సీ పరీక్షలు ఈసారి ఖచ్చితంగా పటిష్టంగా, సమర్థవంతంగా, ఎటువంటి లీకులు లేకుండా పారదర్శకంగా నిర్వహిస్తామని, ఇకపై ప్రశ్నాపత్రాల లీకులు ఉండవని ఇప్పుడైనా నిరాశ నిండిన విద్యార్థులకు భరోసా ఇస్తారా లేదా అని నిలదీసారు.
పిల్లలకోసం ఆలోచిస్తున్నవారైతే, వారి బతుకులతో .. ఇక మీ సర్కారు ఎటువంటి ఆటలు ఆడదనే ధైర్యం కలిగిద్దామనుకుంటున్నారంటే, వెంటనే సంతకం పెట్టండి. 80 వేల పుస్తకాలు చదివి, ఏకంగా రాజ్యాంగాన్నే తిరగరాద్దామన్న మీకు, ఒక సీఎం సంతకంపెట్టిన అఫిడవిట్ పవర్ ఏమిటో, అది ఇచ్చే ధైర్యం ఏమిటో కొత్తగా చెప్పక్కర్లేదు అనుకుంటా. ఇక తెలంగాణాలో ఎప్పటికీ పేపర్ లీకులు ఉండవు, ఇది కేసీఆర్ మాట అని ఒక సంతకంతో చెప్పేయండని అన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking