Take a fresh look at your lifestyle.

ఉద్యమ జ్వాల కేసీఆరే… అభివృద్ధి జ్వాల కూడా కేసీఆరే

0 170

ఉద్యమ జ్వాల కేసీఆరే…

అభివృద్ధి జ్వాల కూడా కేసీఆరే

: మంత్రి హరీష్ రావు

నారాయణ్ ఖేడ్, మార్చి 27 : సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలో బి ఆర్ ఎస్ ఆత్మీయ సమ్మేళనా కార్యక్రమానికి రాష్ట్ర ఆర్థిక ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు హజరయ్యారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ మంజు శ్రీ జయపాల్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి, ఇతర బి ఆర్ ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.

మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ 60 ఏళ్ల నుంచి ఒక కుటుంబం చేతిలో బందీ అయిన నారాయణఖేడ్ నియోజకవర్గానికి స్వతంత్రం కల్పించింది బి ఆర్ ఎస్ కార్యకర్తలు. భారతదేశానికి స్వతంత్రం వచ్చిన నారాయణఖేడ్ కి స్వతంత్రం రాలేదు అభివృద్ధి జరగలేదు. బి ఆర్ ఎస్ ప్రభుత్వం బి ఆర్ ఎస్ ఎమ్మెల్యే బి ఆర్ ఎస్ కార్యకర్తల వల్లే ఈరోజు నారాయణఖేడ్ అభివృద్ధి చెందుతుంది. అత్యధిక గిరిజన జనాభా ఉన్న నియోజకవర్గంలో ఒక్క గిరిజన రెసిడెన్షియల్ పాఠశాల తేలేకపోయారు 60 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు. ఈరోజు ఎక్కడ భూపాల్ రెడ్డి 4 గిరిజన గురుకుల పాఠశాలలుతెచ్చి ఒక ఒక గురుకులానికి నాలుగు కోట్ల 20 లక్షలు మంజూరు చేయించుకున్నారు.

ప్రతి ఇంటికి త్రాగునీరు అందించి అక్కాచెల్లెళ్లకు కిలోమీటర్లు నీళ్లు మోసే బాధ లేదు. మన పక్కనే ఉన్న కర్ణాటక మహారాష్ట్ర లో ఆసరా పెన్షన్ ఉందా పెళ్లయితే కల్యాణ లక్ష్మి ఉందా ఇంటింటికి మంచినీళ్లు ఉన్నాయా రైతుబంధు ఉందా రైతు బీమా ఉందా.బీ ఆర్ ఎస్ అంటే బీదలు రైతులు సామాన్యుల పార్టీ. ఏప్రిల్ 27 తో మన పార్టీ కి 22 యేండ్లు నిండుతాయి. గత అక్టోబర్ లో మారింది పార్టీ పేరు మాత్రమే.ఈ ఎనిమిదేళ్లలో అభివృధ్ధికి సాక్ష్యాలెన్నో.. ఇదీ తెలంగాణ అని మనం గర్వం గా చెప్పుకునే సంగతులెన్నోఅని అయన అన్నారు.

మనం కల గన్నామా 24 గంటల కరెంటు ఉంటదనీ, మిషన్ ప్రతి ఇంటికి నదీ నీళ్లు పైపుల ద్వారా వస్తాయనీ.. సమైక్య పాలనలో కలలో కూడా ఉహించనవి ఇప్పుడెలా సాధ్యమవుతున్నాయి.ఆలాఉద్దీన్ అద్భుత దీపం తో అయిందా. ఏదైనా మ్యాజిక్ తోనే మంత్రం తోనే ఇవన్నీ సాధ్యపడ్డాయా. లంగాణ కు ఆలాఉద్దీన్ అద్భుత దీపం లేదు కానీ ..నిరంతరం ప్రజల జీవితాల నుంచి చీకట్లను తరిమే కేసీఆర్ అనే దీపం ఉందని అన్నారు.

ఉద్యమ జ్వాల కేసీఆర్ యే, అభివృద్ధి జ్వాల కూడా కేసీఆర్ యే. ఆదానీ కి మొన్ననే sbi 12 వేల కోట్ల రూపాయల రుణాలు బీజేపీ ప్రభుత్వం మాఫీ చేసింది.
ఓ నాలుగు వేల కోట్ల రూపాయలు భరించి తెలంగాణ రైతుల వడ్లు కొంటే తప్పేమిటీ.బీజేపీ కి ఆదానీ యే దోస్తు,మన రైతు దోస్తు కాడని చెప్పడానికి ఈ ఒక్క ఉదాహరణ చాలదా.ఆదానీ ఆస్తులు పెంచే నిర్ణయాలు కేంద్ర ప్రభుత్వానివి… ఆమ్ ఆద్మీ సంపద పెంచే నిర్ణయాలు బీ ఆర్ ఎస్ ప్రభుత్వానివి.ఆదానీ అందానీ పెంచే పార్టీ కావాలా అన్న దాత అందానీ పెంచే బీ ఆర్ ఎస్ కావాలా తేల్చుకోవాలని అన్నారు.నెత్తి ,కత్తి లేని వాళ్ళు నత్థి మాటలు మాట్లాడుతున్నారు.

ప్రగతి భవన్, సచివాలయాలను కులుస్తామన్న పార్టీలు తెలంగాణ కు అవసరమా. కూల్చే ,పేల్చే పార్టీలు లు కావాలా, కట్టించే, పని చేసే పార్టీలు కావాలా. నీళ్లిచ్చే పార్టీ కావాలా కన్నీళ్లు తెప్పించే పార్టీ లు కావాలా.
కర్ణాటకలో ఎన్నికలు ఉన్నాయని హిందీ ముస్లింల మధ్యల పగను రెచ్చగొట్టి రాజకీయం చేయాలని ప్రయత్నిస్తుంది బిజెపి పార్టీ. ఎనిమిదేళ్ల బిజెపి పాలనలో ప్రజలకు చేసిన ఒక్క మంచి పనైనా ఇక్కడ బిజెపి నాయకులు చెప్పగలుగుతారా. కొన్ని పనులు చేసిర్రు పెట్రోల్ డీజిల్ ధరలు పెంచిన్రు గ్యాస్ ధరలు పెంచిన్రు నిత్యవసర వస్తువుల ధరలు పెంచిన్రు. మన కార్యకర్తలు ప్రజల్లో చర్చ పెట్టాలి బి ఆర్ ఎస్ ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాలు ప్రజలకు వివరించాలి.

నారాయణఖేడ్లో ఎగిరే జండా టిఆర్ఎస్ జండా భూపాల్ రెడ్డి హాట్రిక్ ఎమ్మెల్యేగా గెలుస్తాడు. 90 నుండి 100 స్థానాలతో బి.ఆర్.ఎస్ మూడోసారి అధికారంలోకి వస్తుంది. హాట్రిక్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. బిజెపి రాజకీయ కక్షతో ఎన్ని కేసులు పెట్టినా ఈడీలు సిబిఐ లు ఎన్ని విధాల ఇబ్బంది పెట్టిన మాకు ఉన్న బలం మన బీఆర్ఎస్ కార్యకర్తల బలం బిజెపి మమ్మల్ని ఏమీ చేయలేదు.

మనల్ని ఇబ్బంది పెట్టినట్టే గతంలో బెంగాల్లో మమతా బెనర్జీని వారి పార్టీ నాయకులని ఇబ్బంది పెట్టి రు కేసులు పెట్టిరు ఇది బిజెపి స్టైల్ .. మళ్లీ అక్కడ మమత బెనర్జీ గెలిచింది ఇక్కడ తెలంగాణలో తిరిగి బీ ఆర్ ఎస్ ప్రభుత్వం వస్తుంది భయపడేది లేదు. ఇంకా ఇలాంటి కుట్రలు మన పైన చాలా జరుగుతాయి మనం వీటన్నిటిని తిప్పి కొట్టాలి సమిష్టిగా కలిసి పోరాటం చేయాలని మంత్రి అన్నారు..

Leave A Reply

Your email address will not be published.

Breaking