Take a fresh look at your lifestyle.

కెసిఆర్ హఠావో.. తెలంగాణ బచావో.. : బిఎస్ పి నేత ప్రవీణ్ కుమార్

0 13

కెసిఆర్ హఠావో.. తెలంగాణ బచావో..

ఈ ముఖ్యమంత్రి మనకు వద్దు.

: బిఎస్పి రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

హైదరాబాద్, మే 7 : కెసిఆర్ హఠావో.. తెలంగాణ బచావో.. ఈ ముఖ్యమంత్రి మనకు వద్దు. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలివ్వకుండా ఒక్కో ఉద్యోగాన్ని పది లక్షలకు అమ్ముకుని  మోసం చేసిన ముఖ్యమంత్రి అవసరమా? అంటూ ఆవేశంగా ప్రశ్నించారు బిఎస్ పి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్. ఉద్యోగులకు మోసం చేస్తూ, వారిపై ఎస్మా ప్రయోగించే ముఖ్యమంత్రి అవసరమా? అంటూ సభకు హాజరైన ప్రజలను ఉత్తేజ పరిచారు ఆయన.

హైదరాబాద్ నగరం సరూర్ నగర్ లో జరిగిన తెలంగాణ భరోసా సభలో డాక్టర్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రసంగించారు. రైతులు ధాన్యం తడిసి అల్లాడుతుంటే ప్రగతి భవన్ లో పడుకున్న ముఖ్యమంత్రి  అవసరమా? అంటూ ప్రజలను ప్రశ్నించారు. జీవోలను దాచిపెట్టే ముఖ్యమంత్రి మనకు అవసరమా? 2 లక్షల కోట్ల విలువైన ఓఆర్ఆర్ ను కేవలం 7800 కోట్లకు లీజుకు ఇచ్చే ముఖ్యమంత్రి అవసరమా? డబ్బులన్ని దోచుకొని ప్రధాని కావడానికి ఖర్చు చేస్తానని చెబుతున్న ముఖ్యమంత్రి అవసరమా? అంటూ ప్రజలనే అడిగారు ఆయన.

దళిత బంధు పథకం కింద లంచం తీసుకున్న ఎమ్మెల్యేల పేర్లు ఏసిబికి ఇవ్వాలని డిమాండ్ చేశారు బిఎస్ పి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్. వందల కోట్లతో ప్రచారాలు కాదు, ఉద్యోగుల సమస్యలు తీర్చాలన్నారు ఆయన. తెలంగాణ ప్రజల డబ్బుతో మహారాష్ట్రకు చెందిన వ్యక్తిని సెక్రటరీగా పెట్టుకొని 1.5 లక్షల జీతం ఎలా ఇస్తారని నిలదీశారు ఆయన.

రాజ్యాంగాన్ని రద్దు చేయాలని మాట్లాడిన ముఖ్యమంత్రి నేడు బిఎస్పిని చూసి భయపడుతున్నారని  పేర్కొన్నారు ఆయన. అందుకే అంబేడ్కర్ విగ్రహం, సచివాలయానికి అంబేడ్కర్ పేరు పెట్టారని గుర్తు చేశారు. పచ్చగా శాంతియుతంగా ఉన్న తెలంగాణలో మతకల్లోలాలలు పెట్టడానికి బిజెపి ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు ఆయన. అమిత్ షా ముస్లింల రిజర్వేషన్లు తొలగించాలని అంటున్నారు. అమిత్ షా ఖబడ్దార్… రిజర్వేషన్లు మీ అయ్య జాగీర్ కాదు. బండి సంజయ్ మసీదులు తవ్వుతామంటున్నారు.

బిజెపి, బిఆర్ఎస్ ఒక్కటే. రెండు పార్టీలు కలిసి తెలంగాణలో రసవత్తర డ్రామా చేస్తున్నాయని వివరించారు ప్రవీణ్ కుమార్. ప్రజలారా ఈ పార్టీల మాయలో పడకండి. మోడీ బిసి ప్రధాని అయితే బిసిల కులగణన ఎందుకు చేయడం లేదో ఆలోచన చేయాలన్నారు ఆయన. బిసిల రిజర్వేషన్లు కెసిఆర్ ఎందుకు పెంచడం లేదని నిలదీశారు ప్రవీణ్ కుమార్. రాష్ట్రంలో పాల వ్యాపారాన్ని కూడా నాశనం చేసి గుజరాత్ కంపెనీకి ఆప్పజెప్పి, రైతులకు అన్యాయం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు.

నిజాలు చెప్పే పత్రికలను ప్రభుత్వం సచివాలయం లోపలికి రానివవ్వడం లేదని గుర్తు చేశారు. డోలు దెబ్బ, మోకు దెబ్బ, తుడుం దెబ్బ, దండోరా దెబ్బను ప్రభుత్వానికి రుచి చూపించాలి. మనకు అన్యాయం చేసిన ప్రభుత్వాన్ని గుంజి కొట్టాలి.

మాయవతి గారు మన మీద పెట్టిన బాధ్యతను నెరవేర్చాలి. బిఎస్పి రాబోయే ఎన్నికల్లో బిసిలకు 60 నుండి 70 సీట్లు ఇస్తుంది. నిరుపేదలకు కనీసం ఎకరం భూమి, పదిలక్షల ఉద్యోగాలు, అంతర్జాతీయ స్థాయి విద్య, ఉద్యోగం ఇచ్చే ఏకైక పార్టీ బిఎస్పి అని పేర్కొన్నారు బిఎస్ పి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్.

ఈ సభలో కళకారులు ప్రదర్శనలు అందరిని ఆకట్టుకున్నాయి. ఈ సభలో బిఎస్ పి ముఖ్య నాయకులు ప్రసంగించారు. ఈ సందర్భంగా బిఎస్ పి అధినేత్రి మాయవతికి జ్ఞాపికను అంద చేశారు బిఎస్ పి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్.

Leave A Reply

Your email address will not be published.

Breaking