Take a fresh look at your lifestyle.

ఢిల్లీ స్కాంలో ఈడీ ముందుకు రాగానే కవిత అరెస్టు

0 167

ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత అరెస్టుకు రంగం సిద్దం

9వ తేదీన హాజరు కాగానే ఈడీ అరెస్టు వ్యూహం

హైదరాబాద్ : సీఎం కూతురు కల్వకుంట్ల కవిత ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్టు తప్పదనే సందేశం ఇప్పటికే వచ్చింది. మారుతున్న రాజకీయ పరిణామాలతో తనను అరెస్టు చేస్తారని కవిత కూడా భావిస్తోంది.  ఆ అరెస్టు ఎప్పుడనేది ఇంత కాలం అందరిలో దాగిన ప్రశ్న.. మార్చి 9వ తేదీన ఈడీ ఎదుట హాజరు కావాలని నోటీసులు జారీ చేసారు అధికారులు. తాను బిజీ ఉండటం వల్ల 15వ తేదీన హాజరవుతానని కవిత లేఖ రాసిన అధికారుల నుంచి స్పందన లేదు.

అయితే.. కవిత అరెస్టును కూడా బీఆర్ ఎస్ తనకు అనుకూలంగా మలుచుకోవడానికి వ్యూహం రచిస్తోంది. ప్రతిపక్షాలను టార్గెట్ చేస్తోందని ఇప్పటికే బీజేపీయేతర అధికారంలో ఉన్న రాష్ట్రాల ముఖ్యమంత్రులు కోడై కూస్తున్నారు. ఇటీవల ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాను అరెస్టు చేయడంతో అందరూ ఒక్కటయ్యారు. ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ కూడా రాసారు.

ప్రధాని మోధీ మాట అనరు మతాలబు తప్పరు అనే సామెతకు అక్షరాల సరి పోతారు. దేశంలో మరోసారి అధికారంలోకి రావాలనే ఉద్దేశ్యంతో ప్రతిపక్షాలపై కన్నెర్ర చేస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడానికి అన్ని హంగులను ఉపయోగిస్తోంది.

ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవితకు సంబంధం ఉండటం వల్లే అరెస్టు చేయడానికి బీజేపీ ముందుకు అడుగులు వేస్తోంది. కవిత కూడా ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్టు తప్పదనే భావనతోనే ప్రజల మధ్య ఉండటానికి ఎక్కువగా ఇష్ట పడుతుంది. ఇటీవల నిజామాబాద్ జిల్లా పర్యాటనలో ఉన్న కవిత అర్ధాంతరంగా హైదరాబాద్ వెళ్లి పోయింది.

అయితే.. ఢిల్లీ లిక్కర్ స్కాం అనగానే ఠక్కున గుర్తుకు వచ్చేంది కవిత పేరే. నలుగురు కలువగానే వచ్చే చర్చ కవిత లిక్కర్ స్కాం గురించే.. ఆమెను ఎప్పుడు అరెస్టు చేస్తున్నారనేది అందరూ చర్చించుకుంటున్నారు. అయితే.. అవినీతి మరుకలతో కవిత కనిపించకుండా బీజేపీ కుట్రగా ప్రజల వద్దకు వెళ్లడానికి కేసీఆర్ వ్యహంలో భాగంగానే 10వ తేదీన ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ధర్నా చేయాలని నిర్ణయించింది కవిత.

ఆ ధర్నా కంటే ఒకరోజు ముందే తమ ముందు హాజరు కావాలని ఈడీ నోటీసులు ఇవ్వడంతో కవిత అరెస్టు ఖరారైనట్లే. అయితే.. కవితను అరెస్టు చేయక పోతే బీజేపీకి నష్టమే. ఇప్పటికే కేసీఆర్ పాలన అవినీతికి నిలయంగా మారిందని పొలిటికల్ లీడరులు ఆరోపణలు చేసిన నేపధ్యంలో కవిత అరెస్టు వల్ల బీజేపీకి మంచి మైలేజ్ పెరుగుతుందని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.

ఒకే మాటను ఔను కాదు అని ప్రజల ముందు చెప్పే సీఎం కేసీఆర్ తన కూతురు కవిత ఢిల్లీ స్కాం గురించి మౌణంగా ఉండటం వెనుక ఏమి వ్యూహం ఉందో ఎదురు చూడాల్సిందే.

 

Leave A Reply

Your email address will not be published.

Breaking