Take a fresh look at your lifestyle.

డ్రగ్స్ కేసులో కబాలి నిర్మాత కేపీ చౌద‌రిని అరెస్ట్

0 16

డ్రగ్స్ కేసులో కబాలి నిర్మాత కేపీ చౌద‌రిని

అరెస్ట్ చేసిన సైబరాబాద్ పోలీసులు

హైదరాబాద్, జూన్ 14 : సినిమా పరిశ్రమకు చెందిన మరో కీలక వ్యక్తిని డ్రగ్స్ కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. డ్ర‌గ్స్ కేసులో సినీ నిర్మాత కేపీ చౌద‌రిని సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. గత కొంత కాలంగా చౌదరి గోవాలో ఉంటున్నారు. ఆయన డగ్స్ వాడుతున్నట్టు తేలడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చౌదరి నుంచి కొకైన్ కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇటీవలే సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో డ్రగ్స్ ముఠాను పోలీసులు పట్టుకున్నారు. వీరి నుంచి పెద్ద ఎత్తున మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. వీరి నుంచి డ్రగ్స్ తీసుకుంటున్న వారి వివరాలను సేకరించారు.

ఈ క్రమంలోనే డ్రగ్స్ వాడుతున్న కేపీ చౌదరిని అరెస్ట్ చేశారు. రజనీకాంత్ ‘కబాలి’ సినిమాకు కేపీ చౌదరి నిర్మాతగా వ్యవహరించారు. గోవా కేంద్రంగా దేశవ్యాప్తంగా డ్రగ్స్ సప్లయ్‌ అవుతున్నట్టు గతంలో పోలీసులు గుర్తించారు. హైదరాబాద్ డ్రగ్స్ సప్లయ్‌ మూలాలను గుర్తించిన పోలీసులు.. మోస్ట్ వాంటెడ్ డ్రగ్స్ కింగ్ పిన్ ఎడ్విన్ ను కూడా అరెస్ట్ చేశారు. అయితే తర్వాత బెయిల్ పై విడుదలయ్యాడు. అంతకు ముందే డ్రగ్స్ కింగ్ పిన్ గోవా హిల్టాప్ యజమాని డిసౌజాని హైదరాబాద్‌ పోలీసులు అరెస్ట్ చేశారు.

అయినప్పటికీ డ్రగ్స్ బిజినెస్ ఆగడం లేదు. డ్రగ్స్ వ్యాపారులు .. కొత్త పద్దతుల్లో ప్రయత్నిస్తున్నారు. వీరికి నైజీరియన్ గ్యాంగులు సహకరిస్తున్నాయి. డ్రగ్స్‌ వినియోగదారుల నుంచి వాట్సాప్‌ కాల్స్‌, వాట్సాప్‌ చాటింగ్‌ ద్వారానే లావాదేవీలు జరుపుతారు. నైజీరియన్లు గోవాకు వివిధ మార్గాల ద్వారా డ్రగ్స్‌ను రవాణా చేసి, గోవా కేంద్రంగా దేశంలోని పలు ప్రాంతాలకు విక్రయిసున్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. హైదరాబాద్ డ్రగ్స్ వ్యవహారాలకు పూర్తి స్థాయిలో చెక్ పెట్టేందుకులు పోలీసులు ఇటీవలి కాలంలో భారీ ఆపరేషన్లు నిర్వహిస్తున్నారు.

మఖ్యంగా హైదరాబాద్‌లో డ్రగ్స్ కు అలవాటు పడిన వారిని గుర్తించి వారికి కౌన్సెలింగ్ ఇస్తున్నారు. వారిపై నిఘా పెడుతున్నారు. పట్టుబడిన నిందితులను ఎప్పటికప్పుడు పోలీసు కస్టడీకి తీసుకొని డ్రగ్స్‌ దందాకు సంబంధించిన మరిన్ని కీలక విషయాలు రాబట్టి.. అసలు సప్లయ్ చైన్ నడుపుతున్న వారిని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. హైదరాబాద్ ఎప్పుడు డ్రగ్స్ కేసు పట్టుబడినా టాలీవుడ్‌తో లింకులు కలుస్తున్నాయి. కేపీ చౌదరి కబాలికి నిర్మాతగా వ్యవహరించినా డ్రగ్స్ కు బానిసై.. తర్వాత అదే వ్యాపారం చేస్తున్నట్లుగా అనుమానిస్తున్నారు. ఈ వ్యవహారంలో మొత్తం లింకులు బయటకు తీసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking