Take a fresh look at your lifestyle.

రాష్ట్ర అభివృద్ధికి జర్నలిస్టులే కీలక పాత్ర

0 49

రాష్ట్ర అభివృద్ధికి జర్నలిస్టులే కీలక పాత్ర

ఏపి ప్రెస్ అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు

నంద్యాల, ఫిబ్రవరి 22 : రాష్ట్ర అభివృద్ధికి జర్నలిస్టుల పాత్ర కీలకమని ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు పేర్కొన్నారు. బుధవారం శ్రీ రామకృష్ణ పీజీ కళాశాల సెమినార్ హాలులో జర్నలిస్ట్ డిపార్ట్మెంట్ కోర్సు, జర్నలిజం మరియు మాస్ కమ్యూనికేషన్‌లో సర్టిఫికేట్ కోర్సు కార్యక్రమాన్ని జ్యోతి వెలిగించి ఆయన ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో రామకృష్ణ పీజీ కళాశాల చైర్మన్ రామకృష్ణారెడ్డి, గురు రాఘవేంద్ర విద్యాసంస్థల చైర్మన్ దస్తగిరి రెడ్డి, ప్రెస్ అకాడమీ సెక్రెటరీ బాలగంగాధర తిలక్, రామకృష్ణ డిగ్రీ కాలేజ్ ప్రతినిధి ప్రగతి, సీనియర్ జర్నలిస్టులు జనార్దన్ రెడ్డి భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ జర్నలిజం అనేది ప్రజలతో మమేకమై… అనేక సవాళ్లను ఎదుర్కొని అన్ని రంగాలకు సంబంధించిన వార్తలను సేకరించి ప్రచురించాల్సి ఉంటుందన్నారు. పరిశోధనాత్మక జర్నలిజం బాద్యతగా ఉండాలే కానీ లేని పక్షంలో సమాజానికి అనర్థం తెస్తుందన్నారు.

అందుకే ఐదు మౌలిక సూత్రాలను ప్రముఖ పాత్రికేయులు ప్రతిపాదించారు. దీనికి ముందు ప్రతి వార్తలో ఉండవలసిన మరో ఐదు అంశాలు ఏమిటంటే ఏ వార్తకు అయినా ఎప్పుడు, ఎక్కడ, ఏమిటి? ఎలా? ఎందుకు ? అన్న ప్రశ్నలకు సమాధానం ఇచ్చేలా వుంటేనే సమగ్రమైన వార్తగా పరిగణించ గలుగుతామన్నారు. ఇక జర్నలిజం ప్రాధమిక సూత్రాలలో ముఖ్యమైనది నిజానికే కట్టుబడి సమాచారంలో యాక్యురసీకి ప్రాదాన్యత ఇచ్చి జవాబుదారి తనంతో ఉండాలన్నారు.

జర్నలిజం ప్రస్తుతం అనేక ఆటుపోట్లను ఎదుర్కుంటోంది. ఇది ఒక ఇండియాకే పరిమితం కాదు. ప్రపంచం అంతటా ఈ సమస్య ఉంది. చైనా వంటి దేశాలలో కమ్యూనిస్టు ప్రభుత్వం ఏమి చెబితే అదే వార్త. అదే జర్నలిజం. ప్రజాస్వామ్య దేశాలలో కొన్ని చోట్ల పత్రికలపై ప్రభుత్వాల డామినేషన్ ఉంటే, మరికొన్ని చోట్ల పత్రికలు ప్రభుత్వాలను డామినేట్ చేయడానికి, బ్లాక్ మెయిల్ చేయడానికి ప్రయత్నిస్తున్నాయన్నారు. అయినా జర్నలిజంలో విలువలు పాటించడానికి ఇప్పటికీ అవకాశం ఉంది. ఇది వారి వారి వ్యక్తిగత ప్రవర్తన బట్టి ఉంటుందన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking