Take a fresh look at your lifestyle.

జర్నలిస్ట్ ఇస్మాయిల్ భాయ్ కంగ్రాట్స్

0 496

జర్నలిస్ట్ ఇస్మాయిల్ ప్రస్థానం..

సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు ప్రాంతంలో జరిగిన ఐజెయు మహా సభలలో సయ్యద్ ఇస్మాయిల్ జాతీయ ఉపాధ్యాక్షులుగా ఎంపికయ్యారు.

గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఎదిగాడు అతను. సూర్యపేట్ లో గ్రామీణ విలేకరిగా జీవితం ప్రారంభించిన ఇస్మాయిల్ అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చారు.

సూర్యపేట్ ప్రాంతంలో ఫస్ట్ లెప్టిస్ట్ స్టూడెంట్ యూనియన్ తో జర్నీ  ప్రారంభించారు.  సమాజంలో జరిగే సమస్యలపై స్పందిస్తూ మంచి గుర్తింపు పొందాడు.

కుల, మతాలకు వ్యతిరేకంగా జరిగే పోరాటంలో పాల్గొనే ఇస్మాయిల్ జర్నలిస్ట్ గా అతని జీవితంలో టర్నింగ్ ఫాయింట్.

ముస్లీంగా ఉండి హిందు యువతి క్రిష్ణవేణిని ప్రేమ వివాహం చేసుకున్నారు ఇస్మాయిల్. ఆ ఆధర్శ దంపతులకు కూతురుకు కుల, మతం వాసన రాకుండా ‘‘ సిద్ర ’’ అని పేరు పెట్టారు.

తెలంగాణ కోసం పాదయాత్ర..

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం కేసీఆర్ ప్రారంభించిన ఉద్యమంలో తాను సైతం అంటూ ఇస్మాయిల్ పాల్గొన్నారు. సూర్యపేట్ నుంచి హైదరాబాద్ అమరవీరుల స్థూపం వరకు పాదయాత్ర చేసి జర్నలిస్ట్ గా తెలంగాణ వాదుల మన్ననలు పొందారు.

అల్లం నారాయణ వెంటే..

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం జర్నలిస్టులతో టీయుడబ్లుజె ఏర్పాటు చేసిన అల్లం నారాయణ వెంటే ఇస్మాయిల్ ఉంటున్నారు. ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియాలో పని చేస్తునే అతను తెలంగాణ ఉద్యమంలో అల్లం నారాయణ, క్రాంతి, రమణలతో కలిసి పని చేశారు.

IJU జాతీయ ఉపాధ్యక్షుడిగా..

ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ (IJU) జాతీయ ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన సయ్యద్ ఇస్మాయిల్ గారికి శుభాకాంక్షలు తెలుపుతున్న మీడియా అకాడమీ అల్లం నారాయణ గారు, IJU జాతీయ అధ్యక్షుడు వినోద్ కోహ్లీ గారు , జనరల్ సెక్రటరీ సభా నాయకన్ గారు, మారుతి సాగర్ గారు, విష్ణువర్ధన్ రెడ్డి గారు,శ్రీధర్, అనిల్, వీరయ్య, ఆసిఫ్ తదితరులు

జర్నలిస్ట్ ఇస్మాయిల్ భాయ్ కంగ్రాట్స్..

  • యాటకర్ల మల్లేష్, జర్నలిస్ట్   

 

Leave A Reply

Your email address will not be published.

Breaking