Take a fresh look at your lifestyle.

శ్రీనగర్ లో జవాన్ ల హోలీ సంబరాలు

0 621

గ్రామస్తులతో కలిసి

హోలీ జరుపుకున్న జవాన్‌లు

శ్రీనగర్‌: శ్రీనగర్.. ఇప్పుడు అక్కడ ప్రశాంత వాతవరణం కనిపిస్తోంది. తీవ్రవాదుల వేటలో జవాన్ లు ఫలితాలు సాధిస్తున్నారు. ఇగో హోలీ పండుగ సందర్భంగా శ్రీనగర్ లో గ్రామస్థులతో రంగులు పోసుకుంటూ ఎంజాయ్ చేశారు జవాన్ లు.

దేశంలో ప్రతి ఏడాది హోలీ పండుగ ఘనంగా జరుగుతుంది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల ప్రజలు కుటుంబసభ్యులు, స్నేహితులతో కలిసి ఉత్సాహంగా హోలీ వేడుకలు జరుపుకుంటారు. కానీ, సరిహద్దుల్లో మనకు రక్షణగా ఉన్న సైనికులకు మాత్రం కుటుంబంతో హోలీ వేడుకలు జరుపుకునే అవకాశం ఉండదు. అందుకే వారు ఏ పండుగ వచ్చిన సమీప గ్రామస్తులతో కలిసి సంబరాలు చేసుకుంటారు.

తాజాగా జమ్ముకశ్మీర్‌ రాష్ట్రం సాంబా జిల్లాలోని అంతర్జాతీయ సరిహద్దు వెంట బార్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ జవాన్‌లు సమీప గ్రామస్తులతో కలిసి హోలీ పండుగ జరుపుకున్నారు. గ్రామస్తులు జవాన్‌లు కలిసి ఒకరిపై ఒకరు రంగులు చల్లుకున్నారు. జవాన్‌లు జాతీయ జెండాలు చేతబూని నృత్యాలు చేశారు. గ్రామస్తులు, జవాన్‌లు ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking