Take a fresh look at your lifestyle.

అసెంబ్లీ ఎన్నికలలో ఎమ్మెల్యేగా గెలుపు కోసం కోట్ల ఖర్చు..

0 20

రాజకీయాల్లో డబ్బులే పెట్టుబడి

సేవ కాదు వ్యాపారమే..

  • పది నుంచి వంద కోట్ల ఖర్చు పెట్టడానికి సిద్దమైన అభ్యర్థులు
  • గెలుపు ధ్యేయంగా బీఆర్ ఎస్, కాంగ్రెస్ ఖర్చులు
  • ఏ సభలు జరిగినా.. డబ్బులకు వచ్చేది ఆ కూలీ జనమే..
  • బీఎస్పీ, కమ్యూనిష్టు పార్టీల సభలకు స్వచ్ఛందంగా జనం హాజరు
  • అధికార పార్టీపై కనిపించని షాడో టీమ్ ల నిఘా..
  • అధికార పార్టీకి సహాకరిస్తున్న పోలీసులు, ఎన్నికల అధికారులు..

డబ్బులు.. డబ్బులు.. ఈ అసెంబ్లీ ఎన్నికలలో డబ్బులు ప్రధాన్యత పాత్ర పోషిస్తోంది. అసెంబ్లీ ఎన్నికలంటెనే కోట్ల రూపాయల ఖర్చు అనేది జగమెరిగిన సత్యం. భారత ఎన్నికల కమీషన్ నిబంధనల ప్రకారం అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థి 40 లక్షల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. కానీ.. కొన్ని నియోజక వర్గాలలో 40 కోట్లు కూడా ఖర్చు చేయడం విశేషం.

బీఆర్ ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఏవైనా ఈ మూడు కూడా డబ్బులను నమ్ముకుని గెలుపు ధ్యేయంగా ఎన్నికలలో పోటీ చేస్తున్నాయనేది నిజం. ఓట్ల కోసం నోట్లు పంచుడే కాదు.. మధ్యం కూడా విచ్చిల విడిగా పంపిణీ చేస్తున్నారు. మరో అడుగు ముందుకు వేసిన కొందరు అభ్యర్థులు దేవాలయాల వద్దకు తీసుకెళ్లి ప్రమాణం చేయించారు. ఈ ఎన్నికలలో ప్రతి పక్షలు అక్రమంగా తరలిస్తున్న డబ్బులను పోలీసులు పట్టుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులనే పోలీసులు, ఎన్నికల అధికారులు టార్గెట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా వీ6 అధినేత, చెన్నూర్ కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామి ఇంటిపై ఈడీ, ఐటీ అధికారులు దాడులు చేయడమే నిదర్శనం.

డబ్బులతోనే రాజకీయాలు..

డబ్బులు లేకుండా ఎన్నికలలో పోటీ చేయలేని పరిస్థితి. ఓటుకు నోటు అనే నినాదం ప్రజలలో ఊత పదంలా మారింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా గ్రామాలకు వెళ్లిన అభ్యర్థి ముందుగానే ముప్పై నుంచి యాభై వేలు పంపి సభకు రావాలని ప్రజలకు డబ్బులు ఇస్తుంటారు. ఏ పార్టీ మీటింగ్ పెట్టినా ఆ జనమే హాజరవుతుంటారు. అయితే.. మరో మూడు రోజులలో పోలింగ్ ఉన్నందున మద్యం, డబ్బులు పంపిణి చేస్తున్నారు. అయితే.. బీఎస్పీ, కమ్యూనిష్టుల సభలకు మాత్రం ప్రజలు స్వచ్ఛందంగ హాజరు కావడం విశేషం.

షాడో టీమ్ లు ఏవి..?

బహిరంగంగానే డబ్బులు పంపిణి చేస్తున్నప్పటికీ షాడో టీమ్ లు, నిఘా వర్గాలు మౌనంగానే ఉంటున్నాయి. ప్రతిపక్షాలపై షాడో టీమ్ లు నిఘా పెట్టడం వల్లనే ప్రతి పక్షాలకు చెందిన కోట్లాది రూపాయలను పోలీసులు స్వాధీనం చేసుకుంటున్నారు. అయితే.. పోలీసులు, ఎన్నికల అధికారుల సహాకారంతోనే కోట్ల రూపాయలు అధికార బీఆర్ ఎస్ అభ్యర్థులకు తరలిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ బాధ్యతను సీఎం కేసీఆర్ కు నమ్మక బంటుగా ఉన్న రాజ్యసభ సభ్యుడు ద్వారా ఈ డబ్బులను తరలిస్తున్నట్లు తెలుస్తోంది.

ఎన్నికల కమీషన్ ఏమి చేస్తోంది..?

అసెంబ్లీ ఎన్నికలలో డబ్బులతో కోట్లు ఖర్చు చేయాలని భావిస్తుంటే షాడో టీమ్ లు.. సర్వేలెన్స్ టీమ్ లు ఎక్కడా కనిపించడం లేదని ప్రశ్నిస్తున్నారు విద్యావంతులు. నిస్వార్థంగా ఎన్నికలు నిర్వహించాల్సిన బాధ్యత ఎన్నికల కమీషన్ పైనే ఉంది. ఎన్నికలు నిర్వహిస్తున్నప్పుడు పోలీసు కమీషనర్ లు.. ఎస్ పిలు, కలెక్టర్ ల పాత్ర కీలకం. అయినప్పటికీ అధికార పార్టీకి అనుకూలంగా పోలీసులు, ఎన్నికల అధికారులు సహకారిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

Shame: పొదుపు రుణాల మంజూరుకు మామూళ్లు.. లక్షకు ఐదు వేలు ఇవ్వాల్సిందేనని డిమాండ్​

ఒక్కో ఓటుకు ఐదు వేల ధర..

అసెంబ్లీ ఎన్నికలలో ఎలాగైనా గెలువాలని అధికార బీఆర్ ఎస్ తో పాటు కాంగ్రెస్ పార్టీలు డబ్బులను నమ్ముకున్నాయి. ఒక్కో ఓటుకు ఐదు వేలకు పైగానే నియోజక వర్గంలో 50 వేల ఓటర్లకు డబ్బులు పంపిణి చేయాలని ఆయా పార్టీల అధిష్ఠానం ఆదేశించినట్లు తెలుస్తోంది.

అయితే.. రియల్ ఎస్టెట్ బిజినెస్ మెన్ లతో ప్రత్యేక మీటింగ్ లు నిర్వహించిన ఓ ప్రజాప్రతినిధి ఎన్నికలలో పోటీ చేస్తున్న బీఆర్ ఎస్ అభ్యర్థులకు పోలీసుల సహకారంతో డబ్బులు తరలిస్తున్నట్లు సమాచారం.  ఇప్పటికైనా షోడో టీమ్ లను ఏర్పాటు చేసి అక్రమంగా డబ్బులు తరలించే వారి భరతం పట్టాలని విద్యావంతులు కోరుతున్నారు.

కామారెడ్డిలో జరిగేది ‘‘పరువు’’ ఎన్నికలలో కోట్లు ఖర్చు..

కామారెడ్డి నియోజక వర్గంలో పరువుకు సంబందించిన ఎన్నికలు జరుగుతున్నాయి. సీఎం కేసీఆర్ అధికార పార్టీ నుంచి పోటీ చేస్తుండగా, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నారు. వీరిద్దరు కూడా ఈ ఎన్నికలను చాలెంజ్ గా తీసుకున్నారు. ఇప్పటికే కేసీఆర్ ఓడి పోతారనే టాక్ వినిపిస్తోంది. అయితే.. కేసీఆర్ ను ఓడించి గెలిస్తే తాను సీఎం కావచ్చానేది రేవంత్ రెడ్డి వ్యూహం. ఈ ఇద్దరు కూడా కోట్లలో డబ్బులు ఖర్చు చేయడానికి వ్యూహాలు రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.

కామారెడ్డిలో గెలుపు బాటలో బీజేపీ అభ్యర్థి..?

అయితే.. బీజేపీ అభ్యర్థి వెంకట రమణరెడ్డి గట్టి పోటీ ఇస్తున్నారు. కేసీఆర్, రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా నాన్ లోకల్ కాగా లోకల్ ఫీలింగ్ ను తీసుకు రావడంలో బీజేపీ సక్సెస్ అయ్యింది. సీఎం కేసీఆర్ ను, కాబోయే సీఎం రేవంత్ లను ఓడించడానికి బీజేపీ అభ్యర్థి వెంకట రమణ రెడ్డి ముందుకు దూసుకెళుతున్నారు.

BCCI | బీసీసీఐ నిర్ణయం పట్ల ఎంపీ సంతోష్‌ కుమార్‌ హర్షం..-Namasthe Telangana

  సీఎం కేసీఆర్ ఫ్యామిలీలో ఆ ఒక్కరు ఎక్కడ..?

సీఎం కేసీఆర్ ఫ్యామిలీలో కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీశ్ రావు, సంతోష్ రావు.. ఈ ఐదుగురు పొలిటికల్ జాబ్ లతో అధికారాన్ని అనుభవిస్తున్నారు. అందుకే నిరుద్యోగం లేని కుటుంబం అంటే కేసీఆర్ దే అని ప్రతి పక్షాలు విమర్శలు చేస్తున్నాయి. కానీ.. కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు, కవిత ఈ నలుగురు బిజీ బిజీగా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ప్రతి రోజు న్యూస్ ఛానెల్స్ లలో.. డైలీ పేపరులలో వీరి వార్త కథనాలు వస్తున్నాయి.

మరి ఆ ఐదో వ్యక్తి సంతోష్ రావు అడ్రసు ఎక్కడ..? అతను ఎన్నికల ప్రచారంలో పాల్గొనక పోవడానికి కారణం ఏమిటీ..? అనే కోణంలో సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతుంది. అయితే.. ఎన్నికలలో డబ్బుల వ్యవహరం సంతోష్ రావు చూస్తున్నట్లు తెలుస్తోంది. మొదటి నుంచి సభలకు దూరంగా ఉండే అతనికి కేసీఆర్ డబ్బుల వ్యహరం చూడాలని ఆ బాధ్యతను అప్పగించినట్లు తెలుస్తోంది. పోలీసు, ప్రభుత్వ ఉన్నత అధికారులతో ఉన్న సంబంధాలతో డబ్బుల వ్యవహారం చూస్తున్నట్లు విశ్వాస నీయ వర్గాల ద్వారా తెలిసింది.

యాటకర్ల మల్లేష్, జర్నలిస్ట్

Leave A Reply

Your email address will not be published.

Breaking