Take a fresh look at your lifestyle.

సీఎం జగన్ కు కేంద్రంతో దోస్తు ముగిసినట్లెనా..?

0 65

ప్రధాని మోదీ కామెంట్స్‌తో

డైలామాలో పడిన వైఎస్ జగన్

న్యూ డిల్లీ/అమరావతి ఏప్రిల్ 7 : ఆంధ్రప్రదేశ్‌ అంటే.. మరీ ముఖ్యంగా సీఎం వైఎస్ జగన్ అంటే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి ఎంత ప్రేమో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. సమయం, సందర్భం వచ్చినప్పుడల్లా వైసీపీపైన బీజేపీ.. బీజేపీపైన వైసీపీ ఓ రేంజ్‌లో ప్రేమను ఒలకబోసుకుంటూ ఉంటారనే ఆరోపణలు కోకొల్లలుగా ఉన్నాయి. లోక్‌సభ, రాజ్యసభలో వైసీపీ ప్రవర్తించిన తీరును ప్రజలంతా చూసే ఉంటారు.

ఇక వైఎస్ జగన్ సర్కార్‌కు ఎప్పుడు ఎలాంటి అవసరమొచ్చినా సరే నిమిషాల్లో అయిపోతూ ఉంటాయ్. ముఖ్యంగా అప్పులు విషయానికొస్తే.. అప్పు కావాలని జగన్ అడగడమే ఆలస్యం.. నిమిషాల్లోనే అప్పులు పుడుతున్నాయ్ అని వార్తా పత్రికలు, టీవీ ఛానెల్స్‌లో చాలా కథనాలు చూసే ఉంటాం. ఇదొక్కటే కాదు ఏపీలో ఏం జరిగినా ఆఖరికి శాంతి భద్రతలు క్షీణించినా కూడా కేంద్రం ఇసుమంత మాట అనదు. పోనీ ఇవన్నీ ప్రధాని మోదీకి తెలియకుండానే జరుగుతున్నాయా అంటే అబ్బే అదేమీ లేదే..

మరి అలాంటిది జగన్ ఉన్నప్పుడు ఒకలా.. లేనప్పుడు ఇంకోలా మోదీ ఎందుకు ప్రవర్తిస్తున్నట్లు..? ఇప్పుడిదే మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ఏపీ ఆర్థిక పరిస్థితి అప్పుల కుప్పగా మారుతోందని ఆర్థిక నిపుణులు, రాజకీయ విశ్లేషకులు మొత్తుకుంటున్నారు. ఈ మధ్యనే పార్లమెంట్ సాక్షిగా ఏపీ అప్పులను కేంద్రం బయటిపెట్టింది. రిజర్వ్ బ్యాంకు నుంచి ఏపీ ప్రభుత్వం మరో రూ.958 కోట్లు అప్పు తెచ్చింది. 7.70 శాతం వడ్డీతో ఆరేళ్లకు బాండ్ల వేలం ద్వారా ఈ రుణం తీసుకుంది.

ఇటీవల ఎఫ్ఆర్బీఎం) కింద నాలుగోసారి అప్పు తెచ్చుకునేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. వాస్తవానికి ఈ మధ్య తీసుకున్న అప్పుతో ఎఫ్ఆర్బీఎం కింద ఇచ్చిన అనుమతి మొత్తం పూర్తి అయిపోయింది. ఈ సంవత్సరంలో నాలుగుసార్లు ఇచ్చిన రుణం, నాబార్డు, లిక్కర్ బాండ్లతో కలుపుకొని మొత్తం రూ. 87,758 కోట్లను ఏపీ ప్రభుత్వం అప్పు చేసినట్టయ్యింది. 2019లో రూ.2,64,451 కోట్లు ఉండగా.. 2020లో రూ.3,07,671 కోట్లు, 2021లో రూ.3,53,021 కోట్లు, 2022 సవరించిన అంచనాల తర్వాత రూ.3,93,718 కోట్లు, 2023 బడ్జెట్ అంచనాల ప్రకారం ప్రస్తుత ఏపీ అప్పు రూ.4,42,442 కోట్లుగా ఉంది. సుమారు రూ.45 వేల కోట్ల అప్పులు చేస్తోందని పార్లమెంట్ వేదికగా పంకజ్ చౌదరి పూసగుచ్చినట్లుగా వివరాలు వెల్లడించారు.

అయితే వైసీపీ మాత్రం పేదలకు సంక్షేమ పథకాలను అందిస్తున్నప్పుడు ప్రభుత్వం అప్పులు చేయడం సహజమని చెబుతోంది. ఇన్ని లెక్కలు తీసి మరీ చెప్పేది కేంద్రమే.. మళ్లీ అప్పులు తీసుకోవడానికి అప్రూవల్ చేసేది కూడా అదే కేంద్ర ప్రభుత్వమే.. చూశారుగా పరిస్థితి ఎలా ఉందో.!

Leave A Reply

Your email address will not be published.

Breaking