Take a fresh look at your lifestyle.

మా పెళ్లి.. మా తెలంగాణ బాష.. మా ఇష్టం..

0 196

తెలంగాణ యాసలో ఆహ్వాన పత్రిక

జహీరాబాద్‌: పెళ్లి వేడుకలు అనేక ప్రత్యేకతలను సంతరించుకుంటున్నాయి. భోజనాలు, అలంకరణ, ఊరేగింపుతో పాటు ఆహ్వాన పత్రికలనూ వైవిధ్యంగా పదుగురు ఎప్పటికీ గుర్తుంచుకునేలా తీర్చిదిద్దుతున్నారు.

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌ శివారులోని భరత్‌నగర్‌కు చెందిన ఓ వివాహ పత్రికను అచ్చంగా తెలంగాణ యాసలో ముద్రించి పంపిణీ చేశారు. ఆహ్వాన పత్రికలో వాడిన కొన్ని తెలంగాణ యాస పదాలు: లగ్గం(లగ్నం), బేస్తారం(గురువారం), అంబటాల్ల(మధ్యాహ్నం), గొట్టంగా(గంటలకు), యాదికుంచుకొని (గుర్తుంచుకొని), పైలంగా (భద్రంగా), దీవనార్తి (దీవెనలు). ఈ పత్రికను చదివిన వారు పెళ్లి పెద్దల భాషాభిరుచిని అభినందిస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking