Take a fresh look at your lifestyle.

అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు

0 56

మార్చి 4 నుండి 11 వరకు

అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు

మహిళలకు మహిళా చట్టాలపై, వాటి వినియోగం పై అవగాహనా కార్యక్రమాలు నిర్వహించాలన్నారు మూడవ అదనపు జిల్లా జడ్జి మరియు మండల న్యాయ సేవాధికార సంస్థ జడ్జి వై వీర్రాజు

తిరుపతి, మార్చి 4 : ఈ నెల మార్చి 4 నుండి 11 వరకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నట్లు మూడవ అదనపు జిల్లా జడ్జి మరియు మండల న్యాయ సేవాధికార సంస్థ జడ్జి వై వీర్రాజు వారు తెలిపారు.

శనివారం ఉదయం స్థానిక మూడవ అదనపు జిల్లా సెషన్స్ జడ్జి కార్యాలయంలో ఏర్పాటుచేసిన సమావేశంలో మండల న్యాయ సేవాధికార సంస్థ తిరుపతి న్యాయమూర్తి గారు మాట్లాడుతూ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ వారి ఆదేశాల మేరకు ఈ నెల మార్చి 4వ తేదీ నుండి 11 వ తేదీ వరకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాలు నిర్వహించడానికి నిర్ణయించామని, ఈ సందర్భంగా మహిళలకు సంబంధించిన చట్టాలు వాటి అమలుపై గ్రామ స్థాయి వరకు మహిళలలో అవగాహన కల్పించే దిశలో ప్యానెల్ లాయర్స్, పారా లీగల్ వాలంటీర్లను కలిపి టీంలు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ఒక పారా లీగల్ వాలంటీర్ ఒక స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి కానీ ఉంటూ వారితో పాటుగా ఒక ప్యానెల్ లాయర్ ఒక టీమ్ గా గ్రామ స్థాయిలో పర్యటించి మహిళలకు మహిళా చట్టాలపై అవగాహన కల్పించే కార్యక్రమాలు నిర్వహిస్తారని తెలిపారు. అలాగే మండల న్యాయ సేవాధికార సంస్థ తిరుపతి వారు కూడా మహిళలకు మహిళా చట్టాలపై మహిళా విశ్వ విద్యాలయాలలో కళాశాలల్లో అవగాహన కల్పించడం జరుగుతుందని అన్నారు.

అందులో భాగంగానే నేడు ప్యారా లీగల్ వాలంటీర్, ప్యానెల్ అడ్వకేట్ వారిని పిలిచి సమావేశం ఏర్పాటు చేసి వారం రోజులపాటు చేపట్టాల్సిన కార్యక్రమాలపై మరియు మహిళా చట్టాలపై అవగాహన కల్పించి ప్రణాళికలు రూపొందిస్తున్నాం అని అన్నారు. మహిళా కళాశాలల్లో ఇలాంటి క్యాంపులు గతంలో కూడా ఏర్పాటు చేసి ర్యాగింగ్, మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, వారికి ఉన్నటువంటి హక్కులు, చట్టాలు ఏం చెబుతున్నాయి అనే వాటిపై మహిళలకు అవగాహన కల్పించడం జరిగిందని అన్నారు. పరిశ్రమలు ఉన్న ప్రాంతాలలో కూడా మహిళల రక్షణకు చట్టాలపై మరియు వాటి వినియోగంపై అవగాహన కల్పిస్తామని తెలిపారు. మీడియా దీనికి సహకరించి మహిళా చట్టాలపై చేపడుతున్న అవగాహన కార్యక్రమాలకు విస్తృత ప్రచారం కల్పించాలని ఈ సందర్భంగా వారు కోరారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking