Take a fresh look at your lifestyle.

సత్యశోధక్ చిన్నారుల వినూత్న శుభాకాంక్షలు

0 14

సత్యశోధక్ చిన్నారుల వినూత్న శుభాకాంక్షలు
నిర్దేశం, నిజామాబాద్ :

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని సత్యశోధక్ పాఠశాల విద్యార్థులు గురువారం “హ్యాపి ఉమెన్స్ డే” ఆంగ్ల అక్షర ఆకారంలో కూర్చోని మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ ఆర్. నర్సయ్య మాట్లాడుతూ సృష్టి పరిణామంలో మహిళల పాత్ర కీలకమైనదని, సమాజ వికాసంలో స్త్రీ సాధికారిత గణనీయంగా ఉంటే కుటుంబ స్థితిగతులు ఉన్నతంగా ఉంటాయని, మనిషిని మనిషిగా చూడాలని అసమానతలు లేని సమాజ నిర్మాణానికి కృషి చేయాలన్నారు.

మహిళల పట్ల గౌరవం, మహిళల హక్కులను కాపాడడం, మనందరి భాద్యతని, మహిళల సంరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking