Take a fresh look at your lifestyle.

అల్వాల్ పోలీస్ స్టేషన్ లో సీడీఈడబ్ల్యూ కేంద్రం ప్రారంభం

0 19

అల్వాల్ పోలీస్ స్టేషన్ లో 

సీడీఈడబ్ల్యూ కేంద్రం ప్రారంభం

అల్వాల్, మే 22 : అల్వాల్ పోలీస్ స్టేషన్ లో నూతనంగా ఏర్పాటు చేసిన (CDEW) సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్ కౌన్సిలింగ్ కేంద్రాన్ని సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర సోమవారం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కెసిఆర్ ప్రభుత్వంలో ముఖ్య ప్రాధాన్యత మహిళలకు పెద్దపీట వేయడంతో రాష్ట్రవ్యాప్తంగా ఏడు కౌన్సిలింగ్ కేంద్రాలను నిర్వహించడం జరిగింది.

అలాగే మహిళల ఇబ్బందులు మరియు ఫైనాన్షియల్ ఇబ్బందులు గాని అన్ని సర్దుకుపోయే విధంగా కౌన్సిలింగ్ కేంద్రాలలో కౌన్సిలర్లు సెషన్స్ వారీగా పిలిపించి మరీ భార్య భర్తల కౌన్సిలింగ్ చేసి వారి జీవితంలో వెలుగునిచ్చే విధంగా మా కౌన్సిలర్లు పని చేస్తున్నారని ఆయన తెలిపారు. అదేవిధంగా పోలీస్ స్టేషన్ సమస్యలు ప్రతి కానిస్టేబుల్ ని అడిగి తెలుసుకుని ఎటువంటి సమస్యలు ఉన్న ఇబ్బందులు ఉన్న నేరుగా నాకు చెప్పవచ్చని అడిగి తెలుసుకున్నారు.
పురాతన పోలీస్ స్టేషన్ భవనాన్ని పరిశీలించిన స్టీఫెన్ రవీంద్ర తక్షణమే పదిలక్షల ఫండ్ సాంక్షన్ చేసే విధంగా తిరిగి పునర్నిర్మానం చేద్దామని తెలిపారు

Leave A Reply

Your email address will not be published.

Breaking