Take a fresh look at your lifestyle.

కొత్త సచివాలయంలో ప్రారంభోత్సవం రోజు..

0 68

కొత్త సచివాలయంలో

ప్రారంభోత్సవం రోజు నుంచే పనులు షురూ

హైదరాబాద్, ఏప్రిల్ 19 :  తెలంగాణ సచివాలయం ప్రారంభోత్సవంతో పాటే పూర్తి స్థాయి కార్యకలాపాలు కూడా జరగాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఆలోగా అన్ని శాఖలను నూతన భవనంలోకి తరలించాలన్నది సర్కార్ ఆలోచన. పూర్తి స్థాయిలో కొత్త ఫర్నీచర్‌ను మాత్రమే వినియోగిస్తున్న తరుణంలో అవసరమైన మేరకు కంప్యూటర్లు, ఇతర సామాగ్రితో పాటు దస్త్రాలను మాత్రమే కొత్త సచివాలయానికి తరలించాల్సి ఉంటుంది. మరో రెండు రోజుల్లో శాఖల వారీగా కేటాయింపులు పూర్తవుతాయని, వచ్చే వారం నుంచి తరలింపు ప్రక్రియ ప్రారంభం కావచ్చని అంటున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking