Take a fresh look at your lifestyle.

ఈ పాలకులు తెలివి లేని దద్దమ్మలు..

0 116

విద్యార్థులకు ఉన్న ఙ్ఞానంలో

ఒక్క శాతం కూడా పాలకులకు లేదు

: బిఎస్ పి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్

నల్గొండ, ఏప్రిల్ 7 (వైడ్ న్యూస్) ఈ విద్యార్థులకు ఉన్న ఙ్ఞానంలో ఒక్క శాతం కూడా ఇక్కడి పాలకులకు లేదన్నారు బిఎస్ పి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్. నల్లగొండ జిల్లా కేంద్ర గ్రంథాలయంలో విద్యార్థులనుద్దేశించి మాట్లాడారు ఆయన. ఇంగిత ఙ్ఞానం ఏ మాత్రం మన పాలకులకు లేదు. మన బతుకులు మార్చాలనే సోయి వాళ్లకు లేదన్నారు ఆయన.

ఈ లైబ్రరీలో కనీసం కుర్చీలు లేవు. కానీ ప్రగతి భవన్ లో లక్షల విలువ చేసే కుర్చీలు ఫర్నీచర్ ఉంటాదన్నారు ఆయన. ప్రగతి భవన్ లో ప్రతి రూం.. కారిడార్ లో ఎసి ఉంటుంది…? కానీ ఈ పిల్లలు చదివే లైబ్రరీలో ఏసి ఉండద్దా అని ప్రశ్నించారు ప్రవీణ్ కుమార్. లీకేజీలు కామన్ అంటున్నారు… కోతికి కొబ్బరిచిప్ప దొరికినట్టు అయిందని ఈ జిల్లా మంత్రి జగదీష్ రెడ్డి అంటున్నారని విమర్శించారు ఆయన.

 షర్మిల మాకు లేఖ రాసింది లీకేజీపై పోరాడాలని, కానీ రాజన్న రాజ్యంలో కూడా లీకేజీలు జరిగాయన్నారు ప్రవీణ్ కుమార్. 30 శాతం ఉద్యోగాలు అమ్ముకొని, 70వాతం ఉద్యోగాలిచ్చారన్నారు ఆయన. ఆ వచ్చిన డబ్బుతో ఒక సభ్యుడు యూజీసి సభ్యుడు అయ్యారన్నారు ఆయన. వంద కోట్ల లిక్కర్ స్కాం చేస్తే అడిషనల్ అడ్వకేట్ జనరల్ నిందితుల పక్షాన పోరాడడానికి వెళ్లారు. మరి విద్యా కోసం ఎందుకు పోరాడరని నిలదీశారు ప్రవీణ్ కుమార్.

పదవ తరగతి పేపర్ లీకేజీ కేసులో 48 గంటల్లో నిందితులు, ప్రధాన సూత్రధారులను అరెస్ట్ చేశారని కానీ మార్చి 11 వ తేదీన సోర్స్ నుండి పేపర్ లీకైంది ఇప్పటి వరకు పబ్లిక్ సర్వీస్ కమీషన్ చైర్మెన్  కమిటీ సభ్యులను అరెస్టు చేయడం లేదన్నారు ఆయన. గురుకుల పాఠశాలల రిక్రూట్మెంట్ చైర్మెన్ గా ఉన్నప్పుడు అవకతవకలు జరగకుండా నిర్వహించానన్నారు ప్రవీణ్ కుమార్.

కాన్ఫిడెన్షియల్ రూంలో ఉండే కంప్యూటర్లకు యు.ఎస్.బి అప్రూవల్ ఉండదన్నారు ఆయన. ప్రవీణ్ ఓఎమ్ఆర్ షీట్ బయటకు రాకపోతే ఈ కుంభకోణం బయటకు వచ్చేది కాదన్నారు ఆయన. పది లక్షల  నుండి కోటి రూపాయలకు పేపర్ అమ్ముకున్నారన్నారు ప్రవీణ్ కుమార్. ఆమరణ నిరాహార దీక్ష చేయడం వల్లే పరీక్ష రద్దు చేశారన్నారు ఆయన. 103 మార్కులు వచ్చిన వ్యక్తి హాల్ టికెట్ పై ఎందుకు తప్పు రాస్తారని అన్నారు ఆయన. జనార్దన్ రెడ్డి కటాఫ్ మార్కుల గురించి ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నించారు ప్రవీణ్ కుమార్. జనార్దన్ రెడ్డికి పేపర్ లీకైన విషయం చాలా మంది కమీషన్  ఉద్యోగులు పరీక్ష రాశారని ముందే తెలుసన్నారు ఆయన.

చైర్మెన్ కఠినంగా పేపర్ రూపొందించాం అని చెప్పారు. మరి దామెర రమేష్, షమీమ్ బార్ అండ్ రెస్టారెంట్ లో పని చేసేవారికి 100 మార్కులెలా వచ్చాయని ప్రశ్నించారు ప్రవీణ్ కుమార్. మొదటి 10 వేల మంది హాల్ టికెట్లు, ఫోన్ నెంబర్లు తీసుకొని కమీషన్ లో పనిచేస్తూ పరీక్ష రాసిన వారి ఫోన్ నెంబర్లు మరియు బోర్డు చైర్మెన్, సభ్యుల నెంబర్లు తీసుకొని మ్యాచ్ చేస్తే పది నిమిషాల్లో దొంగలు దొరుకుతారన్నారు ఆయన.

Leave A Reply

Your email address will not be published.

Breaking