Take a fresh look at your lifestyle.

బొమ్మాగాని వెంకటయ్య ఇకలేరు..

0 96

ప్రజల హృదయాలలో నిలిసిన

బొమ్మాగాని వెంకటయ్య

సూర్యాపేట, ఏప్రిల్ 12 (వైడ్ న్యూస్) సోదరుడు బొమ్మగాని ధర్మ బిక్షం గారి బాట లో నడుస్తూ ప్రజల కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహనీయుడు బొమ్మాగాని వెంకటయ్య అని పొగిడారు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి. అనారోగ్యంతో స్వర్గస్తులైన స్వాతంత్ర్య సమరయోధులు బామ్మగాని వెంకటయ్య భౌతిక కాయానికి మంత్రి నివాళులు అర్పించారు. కమ్యూనిస్ట్ జీవన విధానాన్ని ఆస్వాదించిన మహనీయులు వెంకటయ్య గారన్నారు ఆయన.  బొమ్మాగాని వెంకటయ్య సమాజానికి, కుటుంబ సభ్యులకు తీరని లోటు అని మంత్రి అన్నారు. మంత్రి వెంట బీఆర్ ఎస్ రాష్ట్ర కార్యదర్శి వై. వీ, జడ్పీ వైస్ చైర్మన్ గోపగానీ వెంకట్ నారాయణ గౌడ్, మున్సిపల్  చైర్మన్ అన్నపూర్ణమ్మ, వైస్ చైర్మన్ కిషోర్, అనంతుల దుర్గా ప్రసాద్ ,కమ్యూనిస్ట్ నేతలు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking