Take a fresh look at your lifestyle.

ఐకేపీ కేంద్రాలు వెంటనే తెరవాలి : షర్మిల

0 16

ఐకేపీ కేంద్రాలు వెంటనే తెరవాలి

: వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి  షర్మిల

హైదరాబాద్, మే 2 : రైతులకు జరిగిన పంట నష్టంపై వైఎస్సార్ తెలంగాణ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో 23 జిల్లాల్లో పంట నష్టం జరిగింది. వరి, మొక్కజొన్న పంటలు , మామిడి తోటలు నష్టం జరిగింది. మార్చి-ఏప్రిల్లో పడిన వానలకు దాదాపు 10 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది.

మహబూబాబాద్, ఖమ్మం, జనగాంలో మూడు రోజులపాటు పంటనష్టంపై వివరాల కోసం పర్యటన చేసాం. అప్పులు చేసి 30-40 వేలు పెట్టుబడి పెడితే పంటలు ధ్వంసమయ్యాయని రైతులు చెప్తున్నారు. రాబడి అప్పు తీర్చడానికి కూడా సరిపోవని రైతులు చెప్పుకొని బాధపడుతున్నారు. రైతులకు ముల్లు గుచ్చుకుంటే నా పంటితో తీస్తానని చెప్పిన కేసీఆర్ ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఇది కిసాన్ సర్కార్ అని డబ్బాలు కొట్టుకంటున్న కేసీఆర్ రాష్ట్రంలో రైతులకు ఏం సమాధానం చెప్తారు? మార్చి నెలలో పంట నష్టం జరిగితే వాళ్లను కూడా ఆదుకోలేదని అన్నారు.

మార్చిలో ఖమ్మం, వరంగల్ , కరీంనగర్ జిల్లాలలో పంట నష్టం జరిగిందని కేసీఆర్ గాలి మోటార్ లో తిరిగి గాలి మాటలు చెప్పాడు. 2 లక్షల 34 వేల ఎకారాల్లో పంట నష్టం జరిగింది. ప్రతి రైతుకు ఎకరాకు 10 వేల చొప్పున పరిహారం ఇస్తామన్నారు. సాయంత్రం ఇంటికి పోయేలోపు డబ్బులు విడుదల అవుతాయన్నారు.

కేసీఆర్ ఇంకా ఇంటికి పోలేదా? 2 లక్షల 34 వేల ఎకరాలకు 234 కోట్ల రూపాయలు విడుదల చేస్తామని చేయకపోగా ఇప్పుడు మాట మారుస్తూ లక్షా 51 వేల ఎకరాల్లో మాత్రమే పంట నష్టం జరిగిందని మాట్లాడుతున్నారు. ఏప్రిల్ లో పడిన వానలకు మళ్లీ లక్షల ఎకరాల్లో పంటనష్టం జరిగింది.
ఏప్రిల్ లో 9 లక్షల 60 వేల ఎకరాలకు పంట నష్టం జరిగిందని ఒక అంచనా అయితే కేసీఆర్ లెక్కన ఎకరానికి 10 వేల చొప్పున 960 కోట్ల రూపాయలు రైతులకు చెల్లించాలి.

రైతుల దగ్గరికి ఒక్క అధికారి కానీ, ఎమ్మెల్యే కానీ వచ్చింది లేదు, చూసింది లేదు. పంట నష్టం ఇస్తారనే భరోసా మాకు ఎక్కడిది అని రైతులు వాపోతున్నారు. మార్చిలో జరిగిన పంట నష్టంపై అధికారులు సరైన వివరాలు తీసుకోలేదని రైతులు చెబుతున్నారు.

5 ఎకరాల్లో పంటనష్టపోతే ఒక ఎకరం రాసుకున్నరని తెలిపారు. అలా తప్పుగా రాసుకొని 2 లక్షల 34 వేల ఎకరాలు అని చెప్పి మళ్లీ అది కూడా కాదని లక్షా 51 వేల ఎకరాలే అని చెప్తున్న వారు ఏప్రిల్ లో నష్టపోయిన రైతులను ఆదుకుంటారని ఎలా నమ్మడం? అసలు కేసీఆర్ ఏ రోజైనా రైతులను ఆదుకున్నారా? రైతులకు మునుపటిలా ఇన్ పుట్ సబ్సిడీ లేదు, ఎరువుల మీద సబ్సిడీ లేదు, విత్తనాల మీద సబ్సిడీ లేదు దిక్కుమాలిన కేసీఆర్ పాలనలో పంట బీమా కూడా లేదని అన్నారు.
ఈ 9 సంవత్సరాలలో కేసీఆర్ ఒక్క రైతుకైనా, ఒక్క రూపాయైనా పంట నష్టపరిహారం ఇచ్చారా? ప్రతి సంవత్సరం వెయ్యి నుంచి 1500 కోట్ల పంట నష్టం జరిగింది.

రైతులు తొమ్మిదేల్లలో 14 వేల కోట్ల రూపాయలు నష్టపోతే కేసీఆర్ ఒక్క రూపాయి అయినా ఇచ్చారా? మేం పంట నష్టం తెలుసుకోవడానికి చేసిన పర్యటనలో రైతులు నష్టపోయిన పంటను ట్రక్కులో కేసీఆర్ కు బహుమతిగా పంపిస్తున్నాం. రైతులు తమ భార్యల పుస్తెలు తాకట్టుపెట్టి పంట పండిస్తే వచ్చిన ఫలితం ఇది. కేసీఆర్ వెళ్లని సచివాలయానికి 1600 కోట్లతో ఖర్చు పెట్టి కట్టుకున్నాడు. రైతులు నష్టపోయిన ఈ పంటను సచివాలయం ముందో, ప్రగతి భవన్ ముందో, ఫాం హౌజ్ ముందో పెట్టుకొని నాలుగైదు రోజులు చూస్తే అయినా కేసీఆర్ కు రైతులకు సాయం చేయాలన్న వస్తుందేమో.

తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రైతులు పంపిస్తున్న బహుమతి ఇది. కేసీఆర్ ఫాం హౌజ్ మత్తు వీడాలి. కేసీఆర్ కు మాత్రమే పునర్నిర్మాణం అయింది.. కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కరప్షన్ల చంద్రశేఖర్ రావు అయ్యాడు. రబ్బరు చెప్పులతో స్కూటర్ పై తిరిగే కేసీఆర్.. ఇప్పుడు పార్టీ అకౌంట్ లోనే 1250 కోట్ల రూపాయలున్నాయని అన్నారు. ఏ డబ్బులు లేని వీళ్లు జాతీయ పార్టీలు పెడుతున్నారు. ఎవరికైంది బంగార తెలంగాణ?

కేసీఆర్ , కేసీఆర్ కుటుంబానికి అయింది. ఎన్నికలకు కేసీఆర్ ను అధ్యక్షుడిని చేస్తే అన్ని పార్టీలకు అన్ని ఎన్నికలకు సంబంధించిన ఖర్చంతా ఈయనే పెట్టుకంటాడట.. ఎక్కడి నుంచి వచ్చాయి డబ్బులుని ప్రశ్నించారు. కాళేశ్వరం, మిషన్ భగీరథ, సచివాలయం, మిషన్ కాకతీయ మీ మ్యానిఫెస్టోలో ఉందా? మీ మ్యానిఫెస్టోలో లేని దానిపై లక్షల కోట్లు ఎందుకు ఖర్చు పెట్టారు? రుణమాఫీచేస్తామని మ్యానిఫెస్టోలో పెట్టారు, ఇంటికో ఉద్యోగమిస్తామన్నారు,

పేదలకు డబుల్ బెడ్ రూం ఇండ్లని, నిరుద్యోగ భ్రతి, 57 ఏళ్లకే పెన్షన్, ఉచిత ఎరువులు, సున్నా వడ్డీకే రుణాలు, కేజీ టూ పీజీ ఉచిత విద్య అని చెప్పారు. 30 లక్షల మందికి ఇల్లులు లేవని తెలంగాణ వచ్చాక సర్వేలో తేలిన విషయం. ఎంతమందికి ఇచ్చారు? 4 లక్షల కోట్ల అప్పు చేసి కూడా మ్యానిఫెస్టో లో పెట్టిన వాటికి , సంక్షేమ పథకాలకు ఖర్చు పెట్టలేదు. – ప్రాజెక్టుల పేర్లు చెప్పి కమీషన్లు తీసుకున్నారు. సంక్షేమ పథకాలకు కమీషన్లు రావనే ప్రాజెక్టులు పట్టుకున్నారు. కాళేశ్వరం, మిషన్ భగీరథ, సచివాలయం ఎవరడిగారు?

ఇచ్చిన వాగ్ధానం నిలబెట్టుకోవాలన్న ఇంగీతం ఉందా మీకు? 9 లక్షల 60 వేల ఎకారల్లో పంట నష్టం జరిగితే కేసీఆర్ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. రైతులకు ఎకరాకు కనీసం 20 వేలు చెల్లించాలని వైయస్ఆర్ తెలంగాణ పార్టీ డిమాండ్ చేస్తుంది. 30 శాతం ఐకేపీ కేంద్రాలు కూడా తెరవలేదని ఆమె అన్నారు.

కొనుగోళ్లు వెంటనే వేగం చేయండి.. రైతులకు మిల్లర్లు కనీస మర్యాద ఇవ్వడం లేదు.. తాలు , తేమ, తరుగు పేరుతో 10 కిలోలు కోత పెడుతున్నారు. కేసీఆర్ మిల్లర్ల కోసం పని చేస్తున్నారా? రైతుల కోసం పని చేస్తున్నారా? ఐకేపీ సెంటర్లు తెరిచి వడ్లు కొనాలని, నష్టపోయిన రైతులకు పరిహారం అందించాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking