Take a fresh look at your lifestyle.

బిజేపి వర్సెస్ ఎంఐఎం మధ్య పొలిటికల్ వార్

0 14

దమ్ముంటే తెలంగాణ అంతటా పోటీ చేయు

ఎంఐఎంకు బీజేపీ సవాల్

హైదరాబాద్, మే 31 : దారుస్సలాంలో కూర్చొని ఎంఐఎం ప్రేలాపనలు చేస్తోందని, దమ్ముంటే తెలంగాణ అంతటా పోటీ చేయాలని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సవాల్ విసిరారు. బీఆర్ఎస్ ని చంకలేసుకొస్తారో, కాంగ్రెస్ తో కలిసి వస్తారో రండి, బీజేపీ సింహంలా సింగిల్ గా వస్తుంది, ఎంఐఎంకి డిపాజిట్లు కూడా రానీయకుండా చేస్తాం అని అన్నారు. ఇన్నేల్లుగా పాతబస్తీని ఎందుకు డెవలప్ చేయలేదని ఎంఐఎంని ప్రశ్నించారు.

ముస్లిం యువకులకు పాస్ పోర్టు కూడా లేని పరిస్థితి ఎందుకు వస్తుందని ప్రశ్నించారు. బీఆర్ఎస్ చేతకానీ పార్టీ అని, కారు స్టీరింగ్ ఎంఐఎం చేతిలో ఉందని ఆరోపించారు.బీజేపీ నాగుపాము అని ఎంఐఎం ఉన్నన్ని రోజులు బీజేపీని అధికారంలోకి రానీయకుండా చేస్తామని అసదుద్దీన్ ఓవైసీ చేసి వ్యాఖ్యలపై ఆయన బండి సంజయ్ ఇలా ఆగ్రహం వ్యక్తం చేశారు. సొంతంగా బలపడకుండా ఇంకో పార్టీ బలపడాలని కోరుకునే ఎంఐఎం నాయకులు అధికారంలో ఉన్న పార్టీతో అంటకాగుతూ సొంత ఆస్తులను కాపాడుకోవడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు.

ముస్లిం సమాజమే ఎంఐఎం పార్టీని చీత్కరిస్తోందని బండి సంజయ్ అన్నారు. బీఆర్ఎస్ పై ఎంఐఎంకు ఎందుకంత శ్రద్ధ, అసలు ఆ పార్టీకి అంతటా పోటీ చేసే దమ్ముందా..? దారుస్సలాంలో కూర్చోని బీరాలు పలికితే ఎవరూ పట్టించుకోరని.. నిజంగా జంగా ఎంఐఎంకు దమ్ముంటే తెలంగాణ అంతటా పోటీ చేయాలని సవాల్ విసిరారు. కర్ణాటకలో అంతా ఒక్కటయ్యారట.. ఇక్కడ కూడా గంట నక్కల పార్టీలు ఒకటవుతాయటని అన్నారు.

ఎంఐఎంను ముస్లింలు చీత్కరిస్తున్నారు. ఆ పార్టీని నమ్మడం లేదు. 15 నిమిషాలు టైమిస్తే హిందువులను నరికి చంపుతానన్న నీ తమ్ముడి వ్యాఖ్యలకు జవాబు చెప్పు.? అని ప్రశ్నించారు. మీ ఆస్పత్రిలో పనిచేసే వ్యక్తే ఉగ్రవాద నాయకుడు అని అన్నారు. వాళ్లకు షెల్టర్ ఇస్తూ ఆర్థిక సాయం చేసే పార్టీ నీదని ఆరోపించారు. టెర్రరిస్టులకు బెయిల్ ఇవ్వాలని వాదించిన పార్టీ నీదని విమర్శించారు. శంషాబాద్ లో ఓ వ్యాపారి అమిత్ షాకు ఇల్లు కట్టించారని, అమిత్ షా ఇక ఇక్కడే ఉంటారని ఎంఐఎం చేసిన వ్యాఖ్యలను బండి సంజయ్ కొట్టిపారేశారు. ప్రజా సంగ్రామ యాత్రపై మీడియా అడిగిన ప్రశ్నకు ‘‘బస్ యాత్ర, పాదయాత్రపై పార్టీలో అందరం కూర్చుని నిర్ణయం తీసుకుంటామే తప్ప ఏక్ నిరంజన్ పార్టీ కాదు’’అని పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking