Take a fresh look at your lifestyle.

చైనా స్కూల్ లో పిల్లలు నిద్రపోతే తల్లిదండ్రులకు జరిమానా

0 17

చైనా స్కూల్ లో పిల్లలు నిద్రపోతే

తల్లిదండ్రులకు జరిమానా

చిన్న పిల్లలంటెనే ఆడుకుంటారు.. పాడు కుంటారు.. అలిసి పోయి పడుకుంటారు. కానీ… గా చైనా దేశంలో స్కూల్ లో పోరగాళ్లు నిద్రపోతే గాళ్లకు బెడ్ రూమ్ చూపిత్తారు. మత్తు నిద్ర పొమ్మని ఆయాలు జోల పాట పాడుతారు. గిదంతా మంచిగానే ఉంది కదా అనుకుంటున్నారా..? గట్ల పోరగాండ్లు స్కూల్ లో పడుకున్నందుకు వారి తల్లిదండ్రులు జరిమానా చెల్లించాలి.. అదే అదనంగా ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. నిజం.. చైనాలోని గ్వాంగ్ డాంగ్ ప్రావీన్స్ లోని జిషెంగ్ ప్రైవేట్ స్కూల్ లో గీ రూల్ పెట్టిండ్రు. చైనాంటే కమ్యూనిష్టు దేశం గదా.. గాడ గిదేం రూల్ అనుకుంటుండ్రా.. గీ సంగతి చైనా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటే మీకు చెబుదామని ఇగో గీ వార్త రాసినం.  

  • సోషల్ మీడియా సౌజన్యంతో..

Leave A Reply

Your email address will not be published.

Breaking