Take a fresh look at your lifestyle.

విగ్రహాలు కాదు.. రాజ్యాధికారం కావాలి..

0 77

కేసీఆర్ గారు అంబేద్కర్‌ ఆశయం 

దళిత వర్గాలకు రాజ్యాధికారం కావాలి

హైదరాబాద్, ఏప్రిల్ 13, సింగరేణిని కొనలేని వారు విశాఖను కొంటారా? అని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ ప్రశ్నించారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ ఆశయం నెరవేరాలంటే రాజ్యాధికారం కావాలి, విగ్రహాలు కాదని అన్నారు. సీఎం కేసీఆర్ ప్రధానితో పోటీ పడి 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని పెడుతున్నారన్నారు ఆరోపించారు.

ప్రజలను మోసం చేసేందుకే ముఖ్యమంత్రి ఈ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారని అన్నారు. తాను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక తన హత్యకు ప్లాన్ చేశారని ఆరోపించారు. సింగరేణిని కొనలేని వారు విశాఖను కొంటారా? అని ప్రశ్నించారు. ఉద్యమ సమయంలో ఆంధ్రులను తిట్టాడు. ఇప్పుడు ఏపీని పొగుడతారా అని ప్రశ్నించారు. దేశం మరో శ్రీలంకగా మారుతోందని ధ్వజమెత్తారు. 2008లో కేసీఆర్ తన వద్దకు 10 కోట్లు అడగడానికి వచ్చారని కేఏ పాల్ తెలిపారు.

ఇప్పుడు తనను చిత్రహింసలకు గురిచేస్తున్నారని.. ప్రజల కోసం ప్రాణాలర్పించేందుకు కూడా సిద్ధమన్నారు,అక్టోబర్ 1న జరిగే గ్లోబల్ శాంతి సభను తెలుగు రాష్ట్రాల్లో నిర్వహించాలని కేఏ పాల్ అన్నారు. అక్టోబర్ 1న గ్లోబల్ పీస్ సభ, అక్టోబర్ 2న గ్లోబల్ పీస్ ఎకనామిక్ మీటింగ్ జరగనుందని తెలిపారు. హైదరాబాద్ వచ్చేందుకు చాలా మంది సిద్ధంగా ఉన్నారని.. తన ఆహ్వానాన్ని మన్నించి తెలుగు రాష్ట్రాల్లో నిర్వహించాలన్నారు.

ఈ సమ్మిట్ వల్ల ప్రజలకు మేలు జరుగుతుందని కేఏ పాల్ అన్నారు. తెలుగు రాష్ట్రాల ప్రజల జీవితాలను ఆయన మాత్రమే మార్చగలరని అన్నారు. అలాగే హిట్లర్ వర్ధంతి రోజున సచివాలయాన్ని ఎలా ప్రారంభిస్తారని ప్రశ్నించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking