Take a fresh look at your lifestyle.

ఎసీబీ విచారణ చేస్తే అవినీతి సొమ్ము వెలుగులోకి..

0 42

ఖాకీ డ్రెస్ ముసుగులో కోట్లు సంపాదించింది అధికారులే
– ఎసీబీ విచారణ చేస్తే నిజాలు వెలుగులోకి..
– సంగారెడ్డి టూ సైబరాబాద్ కు వచ్చిన వారిపై అవినీతి మచ్చలు
– అవినీతిపరుల గుండెల్లో నిద్ర పోతున్న సీపీ మహంతి
– అవినీతిని తగ్గించడమే ప్రభుత్వ పాలన

(యాటకర్ల మల్లేష్, చీఫ్ ఎడిటర్)

పోలీస్.. ఖాకీ డ్రెస్ వేసుకుని క్యాష్ లు సంపాదించే వారే ఎక్కువయ్యారు. నీతిని మరిచి అవినీతితో అక్రమంగా ఆస్తులు సంపాదించడంలో పోటీ పడుతున్నారు కొందరు పోలీసు అధికారులు. బీఆర్ ఎస్ ప్రభుత్వంలో పోస్టింగ్ కు యాభై లక్షల నుంచి 75 లక్షల వరకు డబ్బులు కుమ్మరించి రాత్రింబగళ్లు డబ్బుల కోసం పని చేసిన వాళ్లే హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్ లలో ఎక్కువ కనిపిస్తారు.

పోలీసు..

మెజార్టీ సర్కిల్ ఇన్ స్పెక్టర్ లు.. ఎసీపీలతో కొందరు ఉన్నతాధికారులు సైతం భారీగా డబ్బులు సంపాదించడం పైనే దృష్టి పెడుతున్నారు. అయితే.. అవినీతి లేని పాలన కొనసాగించాలని సీఎం రేవంత్ రెడ్డి పోలీసు ఉన్నతాధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది.

రంగారెడ్డి జిల్లాలో పోలీసు అధికారిగా ఉద్యోగం అంటే రాబోయే తరాలకు సైతం సరిపోయే ఆస్తులు సంపాదించ వచ్చానేది జగమెరిగిన సత్యం. సివిల్ కేసుల జోలికి వెళ్లొద్దంటునే సైబరాబాద్ కమిషనరేట్ కు చెందిన కొందరు ఉన్నతాధికారులు సైతం అమ్యామ్యలకు తలొంచి కోట్ల ఆస్తులు సంపాదించారనేది పోలీసు వర్గాలలోనే చర్చా. సివిల్ పంచాయితీలకు కెరాఫ్ గా మారిన పోలీస్ స్టేషన్ లలో ఇన్ స్పెక్టర్లు రెండు చేతులా దండుకున్నారనేది నిజం. అయితే.. దొరికినోడే దొంగ అనే విధంగా తయారైంది. నీతిగా, నిజాయితీగా విధులు నిర్వహించిన పోలీసు అధికారి కోసం టార్చ్ లైట్ తో వెతికినా దొరికే అవకాశం లేదు. బినామీల పేరులతో ల్యాండ్స్ కొనుగోలు చేసి కొందరు ఇన్ స్పెక్టర్ లు.. ఎసీపీలు వందల కోట్ల ఆస్తులు కూడబెట్టినట్లు తెలుస్తోంది.

అవినీతిపరుల గుండెల్లో నిద్ర పోతున్న సీపీ మహంతి

సైబరాబాద్ పోలీసు కమిషనర్ గా అవినాష్ మహంతి బాధ్యతలు స్వీకరించిన తరువాత కొందరు అవినీతి పోలీసు అధికారుల గుండెల్లో గుబులు రేపుతున్నారు. ఇప్పటికే అవినీతి ఆరోపణలతో కొందరు ఇన్ స్పెక్టర్ లను మల్టీ జోన్ కు సరెండర్ చేసి వారి అవినీతిపై విచారణ చేయిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా సంగారెడ్డి జిల్లా నుంచి సైబరాబాద్ కు బదిలీపై వచ్చిన కొందరు పోలీసు అధికారులపై అవినీతి మరకలు అధికంగా కనిపిస్తున్నాయి.

దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలనేది పెద్దలు చెప్పే సామెత.. కానీ.. గతంలో పోలీసు బాస్ ఆశీస్సులు తమకు ఉన్నాయని పోలీసు స్టేషన్ లలో బహిరంగగానే లంచాలు తీసుకోవడం ప్రారంభించారు. పోస్టింగ్ కోసం పోలీసు ఉన్నతాధికారులకు పెద్ద మొత్తంలో డబ్బులు ఇచ్చామని చెపుతూ మరీ తీసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

మాజీ డీజీపీ ల్యాండ్ కబ్జా వెనుక పోలీస్ బాస్

పోలీసు అధికారుల అవినీతి ఎలా ఉందంటే..? బీఆర్ ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ ఫ్యామిలీకి చెందిన ఒకరితో కలిసి ల్యాండ్స్ కబ్జా చేసే స్థాయికి ఎదిగారంటే అవినీతి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. నార్సింగ్ కు దగ్గరలో ఓ రియల్ ఎస్టెట్ వ్యాపారి పది ఎకరాల ల్యాండ్ కబ్జా చేసినందుకు సహాకరించిన పోలీసు బాస్ కు వంద కోట్లతో ఒక ఎకరం ల్యాండ్ కొని గిప్ట్ గా ఇచ్చినట్లు పోలీసు వర్గాలలో చర్చా ప్రారంభమైంది.

నిర్దేశం

ఆ పోలీసు బాస్ సివిల్ కేసులలో జోక్యం చేసుకోవాద్దని కింది స్థాయి అధికారులకు ఉత్తర్వూలు ఇస్తునే మరో దిక్కు తాను మాత్రం యధేచ్చగా బీఆర్ ఎస్ పెద్దలకు సహాకరించారనే ఆరోపణలు ఉన్నాయి. మాజీ డీజీపీ కి చెందిన ల్యాండ్ ను కేసీఆర్ బంధువు (ప్రజా ప్రతినిధి) అక్రమించుకున్నాడనేది వెలుగులోకి వస్తోంది.

అయితే.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఒక్కొక్కరి అవినీతి బహిర్గతం అవుతుంది. ముఖ్యంగా సివిల్ పంచాయితీల పేరిట అక్రమంగా డబ్బులు సంపాదించిన కింది స్థాయి పోలీసు అధికారులను గుర్తించి వారిపై చర్యలు తీసుకోవడంలో భాగంగానే కొందరిని సస్పెండ్ చేశారు. మరి కొందరిని సరెండర్ చేశారు సీపీ మహంతి.

అవినీతి అధికారులపై ఎసీబీ నిఘా..

అవినీతి నిరోదక శాఖ బాస్ సీవీ ఆనంద్.. నిజాయితీగా విధులు నిర్వహించే అతను తప్పు చేసిన వారిని చట్ట రీత్యా శిక్షిస్తుంటారు. అయితే.. సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ లో ఆదాయానికి మించి ఆస్తులు ఉన్న పోలీసు అధికారులపై ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.

ముఖ్యంగా సంగారెడ్డి నుంచి సైబరాబాద్ పోలీసు కమిషరేట్ లో పోస్టింగ్ వేయించుకుని అడ్డగోలుగా సంపాదించిన పోలీసు అధికారులపై ప్రత్యేకంగా విచారణ చేయాలని ప్రజలు కోరుతున్నారు. ముఖ్యంగా పోలీసు అధికారులు బినామీల పేరులతో వందల కోట్లు ఆస్తులు సంపాదించిన విషయమై ఎసీబీ అధికారులు విచారణ జరిపిస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయంటున్నారు.

మల్లేష్ యాటకర్ల

యాటకర్ల మల్లేష్, జర్నలిస్ట్

Leave A Reply

Your email address will not be published.

Breaking