Take a fresh look at your lifestyle.

తెయూ రిజిస్టార్ ఛాంబర్ గదికి నేను తాళం వేయించలేదు

0 14

తెయూ రిజిస్టార్ ఛాంబర్ గదికి నేను తాళం వేయించలేదు.

త్వరలో తేయూ అధ్యపకులనే నూతన రిజిస్టర్ గా నియమిస్తాం.

: వైస్ ఛాన్సలర్ రవీందర్ గుప్తా

డిచ్ పల్లి ( నిజామాబాద్) మే 16 : తెలంగాణ విశ్వవిద్యాలయం  రిజిస్ట్రార్ కార్యాలయం గది కి తాళం తాను వేయించ లేనన్నారు వైస్ ఛాన్సలర్ రవీందర్ గుప్తా.  సోమవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వర్సిటీ సిబ్బంది అయోమయంలో విధులు నిర్వహిస్తున్నారు. వైఛాన్సలర్ తాళంవే యలేదని, రోజువరి లాగే సిబ్బంది వేసిన తలం వేసినట్టే ఉంది. తాను వెయిస్తే అన్ని విధాలా నియమ నిబంధనలతో తాళం వేసి సీజ్ చేసి స్టిక్కర్  వేస్తామని యన పేర్కొన్నారు. రిజిస్ట్రార్ ఎవరు  నియామకం కాక పోవడంతో కార్యాలయంలో పనులు నిలిపివేసామని చెప్పారు. వైస్ ఛాన్సలర్ గా  తెలంగాణ విశ్వవిద్యాలయం అభివృద్ధికి తాను విదులు నిర్వహించిన నాటి నుండి కృషి చేస్తున్నానని , కావాలని తనపై ఎవరో బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని వైస్ ఛాన్సలర్ ప్రో. రవీందర్ గుప్తా ఆరోపించారు.

తెలంగాణ యునివర్సిటీ లో అనేక అభివృద్ధి పనులు జరిగేవి  ఉన్నందున   అభివృద్ధికి ఆటంకం కలుగకుండా తాను యునివర్సిటీలో సిబ్బంది సహాకారంతో పనులు చేస్తున్నామని అన్నారు. రిజిస్ట్రార్ నియామకంలో అనవసర రాధ్ధాంతం జరిగిందని ఆయన అన్నారు. ఎవరు రిజిస్ట్రార్ అని తేల లేక నియామకం రద్దును, కోర్టు నిలిపివేసింది. అందువల్ల రిజిస్ట్రార్ నియామకం అయ్యే వరకు కార్యాలయంకు సీలు వేసి యధావిధిగా పనులు నిర్వహించేందుకు ఏర్పాటు చేసామని వైస్ ఛాన్సలర్ రవీందర్ గుప్తా తెలిపారు.

రిజిస్ట్రార్ నియామకంలో తెలంగాణ విశ్వవిద్యాలయం ఈ.సీ. కమిటీ సహకరించి యునివర్సిటీ అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. ఉస్మానియా యునివర్సిటీ నుండి నియమించిన రిజిస్ట్రార్ ను భయ భ్రాంతులకు గురి చెయడంతో, నియామకమయిన రిజిస్ట్రార్ ప్రో.నిర్మలాదేవి  తిరిగి ఉస్మానియా యునివర్సిటీకీ  వెళ్లి పోయారన్నారు. ప్రస్తుతానకి తెలంగాణ విశ్వవిద్యాలయంలోనే అనుభవజ్ఞులైన అధ్యపకుణ్ణి రిజిస్ట్రార్ గా యునివర్సిటీ ఈ.సి. కమిటీ సభ్యుల నిర్ణయంతో  నియామకం జరుపుతామని వెల్లడించారు. ఇంకా అభివృద్ధిలో భాగంగా 20కోట్ల రూపాయల రూసా నిధులు వెనక్కి వెళ్లాయని, యునివర్సిటీ పరిపాలన సౌలభ్యంకోసం ఇంకా 39 మంది సెక్యూరిటీ గార్డులు ఇతర నాన్ టీచింగ్, ఔట్ సోర్సింగ్ స్థాఫ్ నియామకం చేయనున్నట్లు ఇందుకు గాను యునివర్సిటీ అభివృద్ధిని కోరుకొనే ఈసి కమిటీ పూర్తి గా సహకరించాలని కోరారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking