Take a fresh look at your lifestyle.

సమ్మర్ లో ఎంజాయ్ చేయాలని ఉందా..

0 148

హైదరాబాద్ టూ ఊటీ… సమ్మర్ టూర్

హైదరాబాద్, మార్చి 29, (వైడ్ న్యూస్) సమ్మర్ వచ్చేసింది…! అయితే చాలా మంది కొత్త కొత్త ప్లేస్ లను చూసేందుకు ప్లాన్ చేసే పనిలో ఉంటారు. కొందరు అధ్యాత్మిక పర్యటనలకు వెళ్లాలని అనుకుంటే… మరికొందరూ సేద తీరే ప్రాంతాల కోసం సెర్చ్ చేస్తుంటారు. అయితే మీకోసం రకరకాల ప్యాకేజీలను అందుబాటులో తీసుకువస్తోంది ఐఆర్‌సీటీసీ టూరిజం.

తాజాగా హైదరాబాద్ నుంచి తమిళనాడులోని పలు ప్రాంతాలను చూసేందుకు టూర్ ప్యాకేజీని ప్రకటించింది. ‘ULTIMATE OOTY EX HYDERABAD (SHR094)’ పేరుతో ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. ఈ టూర్ లో ఊటీ, కున్నూర్ వంటి పర్యాటక ప్రాంతాలు కవర్ అవుతాయి.
5 రాత్రులు, 6 రోజుల టూర్ ప్యాకేజీ ఇది. ఊటీతో పాటుగా కూనూర్‌లోని పర్యాటక ప్రాంతాలను చూడొచ్చు. ప్రస్తుతం ఈ టూర్ ఏప్రిల్ 4వ తేదీన అందుబాటులో ఉంది. షెడ్యూల్ చూస్తే…
Day 1 : ఊటీ టూర్ ప్యాకేజీ మొదటి రోజు హైదరాబాద్‌లో ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 12.20 గంటలకు శబరి ఎక్స్‌ప్రెస్ రైలు ఉంటుంది. రాత్రి అంతా జర్నీ చేయాలి.
Day 2 : రెండో రోజు ఉదయం 8 గంటలకు కొయంబత్తూర్ రైల్వే స్టేషన్ కు వెళ్తారు. అక్కడ నుంచి ఊటీకి తీసుకెళ్తారు. హోటల్‌లో చెకిన్ అవ్వాలి. తర్వాత బొటానికల్ గార్డెన్స్, ఊటీ లేక్ ను చూపిస్తారు. రాత్రి భోజనం చేసి ఊటీలో బస చేయాలి.
Day 3 : మూడో రోజు దొడబెట్ట పీక్, టీ మ్యూజియం పైకారా ఫాల్స్ సందర్శనకు వెళ్తారు. రాత్రికి ఊటీలో బస చేయాలి.
Day 4 : నాలుగో రోజు కూనూర్ సైట్ సీయింగ్ కు తీసుకెళ్తారు. రాత్రికి ఊటీలోనే భోజనం చేసి బస చేయాలి.
Day 5 : ఐదో రోజు ఉదయం హోటల్ నుంచి చెక్ అవుట్ చేయాలి. అక్కడ నుంచి కొయంబత్తూర్ రైల్వే స్టేషన్‌కు పర్యాటకులను తీసుకెళ్తతారు. మధ్యాహ్నం 4.35 గంటలకు శబరి ఎక్స్‌ప్రెస్ ఉంటుంది. రాత్రి మెుత్తం జర్నీ చేయాలి.
Day 6 : ఆరో రోజు మధ్యాహ్నం 12.20 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటారు. దీంతో టూర్ ముగుస్తుంది.
ఊటీ టూర్ ప్యాకేజీ ధర చూసుకుంటే.. స్టాండర్డ్ ప్యాకేజీ ట్రిపుల్ ఆక్యుపెన్సీ ధర రూ.11,870, డబుల్ ఆక్యుపెన్సీకి రూ.15,220గా ఉంది. కంఫర్ట్ ప్యాకేజీ ధరలో ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ.14,330, డబుల్ ఆక్యుపెన్సీకి రూ.17,670, సింగిల్ ఆక్యుపెన్సీకి రూ.31,410గా నిర్ణయించారు. 5 నుంచి 11 ఏళ్ల చిన్నారులకు వేర్వురు ధరలు ఉన్నాయి. పూర్తిగా ధరల వివరాలను కింద ఇచ్చిన జాబితాలో చెక్ చేసుకోవచ్చు.

Leave A Reply

Your email address will not be published.

Breaking