Take a fresh look at your lifestyle.

హైదరాబాద్ కొత్త పోలీస్ బాస్ మార్క్

0 15

హైదరాబాద్ కొత్త పోలీస్ బాస్ మార్క్

హైదరాబాద్ పోలీసు కమీషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి విధులలో చేరిన వెంటనే తన ముద్ర వేసుకున్నారు. చిక్కడ పల్లి పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహించిన మాజీ డీఐ ప్రసాద్ ను చిక్కడపల్లి  పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపిచారు. రియల్ ఎస్టెట్ వ్యాపారి రాజుపై దాడి చేసినట్లు అందిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నట్లు సీఐ సీతయ్య పేర్కొన్నారు. ఎన్నికల సందర్భంగా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో డీఐగా పని చేశారు. రాజును తీసుకు వచ్చిన ఇద్దరి కానిస్టేబుళ్ల కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

కాగా సీపీ శ్రీనివాస్ రెడ్డి ఆదేశాలతోనే సీఐ ప్రసాద్ ను అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. అలాగే పోలీసు అధికారుల పోస్టింగుల్లో కూడా పొలిటికల్ ఫైరావీలు చేయద్దని మీడియా సమక్షంలో హెచ్చరించారు. ప్రతిభ ఉన్న అధికారులకు పోస్టింగ్ లు వస్తాయన్నారు ఆయన.

బీఆర్ ఎస్ ప్రభుత్వంలో ఎమ్మెల్యేనో.. మంత్రి లేఖ ఇస్తే పోస్టింగ్ ఇచ్చే అనావాయితీకి హైదరాబాద్ కొత్త పోలీస్ బాస్ పుల్ స్టాప్ పెట్టారు. ఖాకీ డ్రెస్ వేసుకుంటే ఏమి చేసినా చెల్లుతుందని భావించే అవినీతి పోలీసు అధికారులకు హైదరాబాద్ పోలీసు కమీషనర్ శ్రీనివాస్ రెడ్డి సింహస్వప్నంలా మారారంటున్నారు ప్రజలు.

Leave A Reply

Your email address will not be published.

Breaking