Take a fresh look at your lifestyle.

యాదగిరిగుట్ట వద్ద పోలీసుల వేధింపులు ఆపాలి

0 15

యాదగిరిగుట్ట వద్ద ట్రాఫిక్ పోలీసుల వేధింపులు ఆపాలి..

భక్తులను వేధిస్తే ఊరుకోమన్న వీహెచ్‌పీ

యాదాద్రి,జూన్ 7 : దేవాలయాల వద్ద ట్రాఫిక్ పోలీసుల వేధింపులు ఆపాలని విశ్వహిందూ పరిషత్ డిమాండ్ చేసింది. ఈరోజు ఉదయం రాచకొండ పోలీస్ కమిషనర్ దేవేందర్ షింగ్ చౌహాన్‌ను విశ్వహిందూ పరిషత్ నేతలు కలిశారు.

రాచకొండ కమిషనర్ పరిధిలో గల దేవాలయాల అన్నింటి దగ్గర ట్రాఫిక్ పోలీసుల వేధింపులు మానుకోవాలని వినతి చేశారు. యాదగిరిగుట్ట పరిసర ప్రాంతాలతో పాటు గుట్టకు వెళ్లే రహదారిలో భక్తులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తూ.. పొల్యూషన్, పెండింగ్ చలాన్లు చెల్లించాల్సిందేనని పోలీసులు హుకుం జారీ చేస్తున్నారని మండిపడ్డారు. “నిరంతరం మేము రోడ్డుపైనే సంచరిస్తుంటాము.. మరో సందర్భంలో కడతాము” అని చెబుతున్నా భక్తులను పోలీసులు కదలనివ్వడం లేదన్నారు.

దీంతో దేవాలయాలకు వెళ్లాలంటేనే భక్తులు భయపడాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని మండిపడ్డారు. ఈ సమస్యపై వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని రాచకొండ పోలీస్ కమిషనర్‌ దేవేందర్ సింగ్‌ను విశ్వహిందూ పరిషత్ నేతలు కోరారు.విశ్వహిందూ పరిషత్ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి పండరీనాథ్, సహకార్యదర్శి భానుప్రసాద్, రాష్ట్ర ఉపాధ్యక్షులు జగదీశ్వర్, బజరంగ్ దళ్ రాష్ట్ర కన్వీనర్ శివరాములు,నాయకులు కిషోర్, చైతన్య తదితరులు కమిషనర్‌ను కలిసినవారిలో ఉన్నారు .

Leave A Reply

Your email address will not be published.

Breaking