Take a fresh look at your lifestyle.

పేపర్ లీకేజ్ కేసును సిబిఐకి ఇవ్వండి

0 575

నిరుద్యోగుల భరోసా సదస్సు

పేపర్ లీకేజ్ కేసులో..

సిఎం గారు.. సిబిఐతో  విచారణ చేయించండి :

: బిఎస్పి రాష్ట్ర అధ్యక్షులు డా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

హైదరాబాద్, మార్చి 20 : మీ కోసం మేముంటాం.. మీతోనే మేముంటాం… మీకోసం ఏం చేయడానికైనా సిద్ధం అన్నారు బిఎస్పి రాష్ట్ర అధ్యక్షులు డా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. హైదరాబాద్ నగరం చిక్కడపల్లిలో సోమవారం నిరుద్యోగులతో ర్యాలీగా సభావేదిక వద్దకు బిఎస్పి రాష్ట్ర అధ్యక్షులు డా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేరుకున్నారు.

పేపర్ లీకేజ్ పై సుప్రీంకోర్టులో కేసు వేయబోతున్నామన్నారు ఆయన. TSPSC చైర్మెన్ ను తొలగించాలి, బోర్డు సభ్యులు కూడా వైదొలగాలన్నారు ఆయన. చాలా మంది TSPSC లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారన్నారు ప్రవీణ్ కుమార్. భవిష్యత్ లో జరగబోయే పరీక్షల పేపర్లు కూడా నిందితుని ఫోన్ లో దొరికాయన్నారు ఆయన. నిరుద్యోగ అభ్యర్థులకు నష్టపరిహారం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.

హెల్ప్ లైన్, పౌష్టికాహారం, కౌన్సెలింగ్ సెంటర్లు ఏర్పాటు చేయాలన్నారు ఆయన. సిట్ తో కాకుండా సిబిఐతో  విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అనుమానితులందరిని విచారించాలన్నారు ప్రవీణ్ కుమార్. రాజకీయ నాయకులను కూడా విచారించాలి.

317  ఆర్టికల్ ప్రకారం TSPSC బోర్డును తొలగించాలన్నారు. గ్రూప్ 1 రద్దు చేయాలని డిమాండ్ చేసి, ఆమరణ నిరాహార దీక్ష చేశానని, ఎందుకంటే ఈ దొడ్డి దారిన ఆఫీసర్లు అయిన దొంగలు ఈ రాష్ట్రాన్ని, దేశాన్ని దోచుకుంటరు, నాశనం చేస్తరు అని ఆమరణ నిరాహార దీక్ష చేశానని గుర్తు చేశారు.

ఆ సమయంలో ఒక్క సారిగా సిరిపురం యాదయ్య గుర్తుకొచ్చారు. ఆయన ప్రాణ త్యాగం ముందు నా దీక్ష, నా ప్రాణం ఎక్కువ కాదు. పేరు, ఊరు, ఏం కావాలి అని అడిగితే జై తెలంగాణ అని చెప్పారన్నారు ఆయన.  బిఎస్పి పార్టీలో ఆమరణ నిరాహార దీక్ష ఉండదు కానీ నేను నిరుద్యోగుల కోసం ముందుకు వచ్చానని ప్రవీణ్ కుమార్ అన్నారు. రాజకీయ నాయకులు, జర్నలిస్టులు ఉద్యమకారుల ఫోన్లు ట్యాప్ చేసిన మీరు TSPSC ఉద్యోగుల ఫోన్లు ఎందుకు ట్యాప్ చేయలేరని ప్రశ్నించారు. ఈ భరోసా సదస్సులో పెద్ద ఎత్తున నిరుద్యోగులు పాల్గొనడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు బిఎస్ పి కార్యకర్తలు.

Leave A Reply

Your email address will not be published.

Breaking