Take a fresh look at your lifestyle.

వైయస్సార్ చేయూత లబ్ధి కోసం ఆధార్ అనుసంధానం కోసం వచ్చిన వారికి గుడిబండ ఎస్ఐ వారి సిబ్బంది అన్నదానం నిర్వహించారు

0 50

ఏపీ39టీవీ న్యూస్
మే 28
గుడిబండ:- వైఎస్ఆర్ చేయూత లబ్ధి కోసం ఆధార్ నీ అనుసంధానం చేయాల్సి ఉంది. అయితే చాలామందికి ఆధార్ అనుసంధానం కాక పోతే వైఎస్ఆర్ చేయూత పథకం వర్తించదు .ఈ కరోనా కష్ట కాలంలో ముందే రైతుల పరిస్థితి అధోగతి గా మారింది. కనీసం ఇలాంటి వాటితో అయినా కాస్త ఊపిరి పీల్చుకోవచ్చు అని
గుడిబండ మండలం మరియు 5 మండలాల నుంచి 150మంది జనం ఎండను సైతం లెక్క చేయకుండా క్యు లైన్ల లో వేచి ఉన్నారు. అయితే కరోనా సమయం ఇలా అందరూ పెద్ద ఎత్తున ఒక చోట ఉండటం వల్ల కరోనా వస్తుంది. అయితే మీ సేవ కేంద్రాల మాత్రం మధ్యాహ్నానికి మూసేశారు. వాళ్లు ఎండలో వేచి ఉండటం చూసి వారి కష్టాన్ని అర్థం చేసుకొని గుడిబండ ఎస్ఐ సుధాకర్ యాదవ్ అక్కడికి చేరుకొని వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి మీసేవ ను ఓపెన్ చేపించి వాళ్ళకి అందుబాటులో ఉండేలా చేసి 150 మందికీ మధ్యాహ్న భోజనం సౌకర్యం ఏర్పాటు చేశారు. ఎన్నో సేవా కార్యక్రమాలకు నిలువెత్తు రూపం ఆయన.నిత్యం ప్రజల కోసం,ప్రజల మనిషిగా నిలబడతాడు. ప్రజలకు అండగా ఉంటూ జిల్లాలోనే ఎస్ ఐ సుధాకర్ యాదవ్ మంచి సేవా కార్యక్రమాలు చేస్తూ పోతున్నారు. ఆయన మానవతా దృక్పథానికి హృదయ పూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నమని మహిళలు తెలిపారు
ఈ కార్యక్రమంలో మండల పోలీస్ సిబ్బంది జాందర్ విజయ్ కుమార్, కానిస్టేబుల్స్ హనుమంతరాయప్ప, నవీన్, దాదాపీర, మరియు ప్రజలు పాల్గొన్నారు..

కొంకల్లు శివన్న
రిపోర్టర్
ఏపీ39టీవీ న్యూస్
గుడిబండ

Leave A Reply

Your email address will not be published.

Breaking