Take a fresh look at your lifestyle.

గాంధీకి నివాళులు అర్పించిన గవర్నర్ తమిళ సై

0 55

బాపు ఘాట్ లో నివాళులు అర్పించిన గవర్నర్ తమిళ సై

హైదరాబాద్ : జాతిపిత మహాత్మాగాంధీ 75వ వర్ధంతి. దేశానికి స్వాతంత్య్రం తీసుకరావడంలో కీలకంగా వ్యవహరించిన గాంధీని గాడ్సె హత్య చేసిన విషయం విధితమే.. అయితే.. జాతిపీతగా పిలిసే గాంధీ వర్ధంతిని దేశ ప్రజలు జరుపుకున్నారు.

మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా బాపు ఘాట్ లో నివాళులు అర్పించిన గవర్నర్ తమిళ సై, మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహా ముద్ అలీ, సిఎస్ శాంతి కుమారిలు.

అలాగే తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఆవరణలోని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన శాసన సభాపతి శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి, శాసన మండలి చైర్మన్ శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డి, MLC లు, లెజిస్లేటివ్ సెక్రటరీ డా. వి నరసింహా చార్యులు‌, అధికారులు.

ఈసందర్భంగా స్పీకర్ పోచారం గారు మీడియాతో మాట్లాడుతూ…

జాతిపిత మహాత్మాగాంధీ గారి 75వ వర్ధంతి సందర్భంగా వారికి ఘనంగా శ్రద్ధాంజలి ఘటించాం.

వారు మన మద్య లేకపోయినా వారి జ్ఞాపకాలను మనం గుర్తు చేసుకోవాలి.

సృష్టి ఉన్నంత వరకు మహాత్మాగాంధీ గారు అందరికీ గుర్తు ఉంటారు.

గాంధీ గారు కలలు కన్న గ్రామ స్వరాజ్యం రావాలి.

గ్రామ స్వరాజ్యాన్ని నూటికి నూరు శాతం అమలు చేస్తున్న వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు.

గ్రామాలలో ప్రజలకు అవసరమైన మౌళిక సదుపాయాలు కల్పిస్తున్నారు.

దీనితో బతుకు తెరువుకు పట్టణాలకు వలస వెళ్ళిన వారు తిరిగి వస్తున్నారు.

తెలంగాణ రాష్ట్రంలో రివర్స్ వలసలు మొదలయ్యాయి.

Leave A Reply

Your email address will not be published.

Breaking