Take a fresh look at your lifestyle.

ప్రభుత్వ వైద్యం పేద ప్రజల ప్రాణాలకు ప్రమాదం : బిఎస్ పి

0 13

తెలంగాణలో ప్రభుత్వ వైద్యం పేద ప్రజల ప్రాణాలకు ప్రమాదం
– గాంధీ ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం వల్ల పేద యువకుడి చెయ్యి స్పర్శ లోపం
– బీఎస్పీ రాష్ట్ర అధికార ప్రతినిధి జక్కని సంజయ్ కుమార్

హైదరాబాద్ జూన్ 8 : తెలంగాణలో ప్రభుత్వ వైద్యం పేద ప్రజలకు పెనుభూతంగా మారిందని బిఎస్పి రాష్ట్ర అధికార ప్రతినిధి జక్కని సంజయ్ కుమార్ అన్నారు.తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సమయంలో కెసిఆర్ గారు మండలానికి ఒక వంద పడకల ఆసుపత్రి ఏర్పాటు చేస్తామని ప్రకటించిన విషయం కేవలం మాటలు హామీలు గాని మిగిలిపోయిందని, కమిషన్ల కోసం కోట్ల రూపాయల ప్రజా ధనంతో అవినీతి చేసి దాదాపు 5లక్షల కోట్లు సంపాదించిన కెసిఆర్ గారి కుటుంబం వైద్య వ్యవస్తపై మాత్రం చిత్తశుద్ది లేదని, రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రిలలో కనీసం మౌలిక సదుపాయాలు కరువు అయినాయని, వైద్యుల నిర్లక్ష్యం వల్ల పేద ప్రజల ప్రాణాలకు ప్రమాదాలు ఎదురవుతున్నాయని దుయ్యబట్టారు.

వైద్యుల నిర్లక్ష్యం వల్ల:

కరీంనగర్ జిల్లా, శంకరపట్నం మండలం, కొత్తగట్టు గ్రామంలో గడ్డం రజనీకాంత్ అనే యువకుడు ఆరోగ్యం బాగోలేక ఫిబ్రవరి 6వ తేదీన హైదరాబాద్లోని గాంధీ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేరినాడు, కానీ అక్కడ వైద్యుల నిర్లక్ష్యం వల్ల ఐవి కానల్ పెట్టడం విఫలమై ఎడమ చేయి పూర్తిగా పనిచేయడం లేదు. సర్జరీ చేసిన కూడా ఉపయోగం లేకుండా పోయింది. ఫిబ్రవరి 12 తారీఖు రోజు జరిగిందని తెలిపారు.ఫిబ్రవరి 12 నుంచి మే 28 వరకు దాదాపు మూడు నెలలు ఆసుపత్రిలో ఉన్నారు, డిశ్చార్జ్ చేయకుండా ఆన్ లీవ్ పై ఇంటికి పంపించారు.

ఈ యువకుడి చెయ్యి పూర్తిగా పని చేయడం లేదు, ఒకవేళ అది నయం కావాలంటే దాదాపు ఆరు సంవత్సరాలు పడుతుంది అని వైద్యులు చెబుతున్నారు, చాలా నిరుపేద కుటుంబం, యువకుడు పనిచేస్తూనే వాళ్ళ కుటుంబం గడుస్తుంది, ఈ విషయంపై మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ దృష్టికి, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ దృష్టికి తీసుకెళ్లిన కూడా వారు పట్టించుకోలేదు.

ఈరోజు గాంధీ ఆసుపత్రి నుంచి ఆన్ లీవ్ లో వచ్చిన గడ్డం రజనీకాంత్ ను వారి స్వగృహంలో పరామర్శించిన జక్కని సంజయ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ వైద్యం పేద ప్రజలకు పెనుభూతంగా మారిందని, రజనీకాంత్ చెయ్యి స్పర్శ లోపించడం దానిపైన చర్యలు తీసుకోవాలని మంత్రులు హరీష్ రావు కేటీఆర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్లు దృష్టికి తీసుకుపోయిన పట్టించుకోకపోవడం లేదన్నారు.

మెరుగైన వైద్య సదుపాయాల అందించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరు ఎత్తినట్ల వ్యవహరించడం వల్ల అనేకమంది ప్రాణాలు పోతున్నాయని, రాష్ట్రంలోనే అతిపెద్ద ఆసుపత్రి అయిన గాంధీ ఆసుపత్రిలో ఇలాంటి వ్యవహారం చోటు చేసుకోవడం నిజంగా బాధాకరమని, వెంటనే ప్రభుత్వం స్పందించి విషయంపై దర్యాప్తు చేసి నిర్లక్ష్యానికి గురిచేసిన వైద్య సిబ్బందిపై చర్యలు తీసుకోవాలన్నారు.

అదేవిధంగా ఆ యువకుడికి 50 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ మానకొండూరు నియోజకవర్గ ఇంచార్జ్ కుమ్మరి సంపత్, మండల అధ్యక్షులు దేవునూరి భాస్కర్, అడ్వకేట్ సిద్దు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking