Take a fresh look at your lifestyle.

కార్మికుల పిల్లలకు ఉద్యోగాలు రావద్దని ప్రభుత్వం కుట్ర

0 828

కార్మికుల పిల్లలకు ఉద్యోగాలు రావద్దని ప్రభుత్వం కుట్ర

: బిఎస్ పి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ప్రవీణ్ కుమార్

సంగారెడ్డి, మార్చి 25 : కార్మికుని బిడ్డ కంపెనీ ఓనర్, కలెక్టర్ కావాలి. కానీ.. కార్మికుల పిల్లలకు ఉద్యోగాలు రావద్దని ప్రభుత్వ కుట్ర చేస్తుందన్నారు బిఎస్ పి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ప్రవీణ్ కుమార్. అందుకే పేపర్లు అమ్ముకుని అన్యాయం చేశారని ఆయన ఆరోపించారు. మన కార్మికులు, కూలీలు, పేదల బిడ్డలకు అన్యాయం జరగవద్దని బిఎస్పి ఆధ్వర్యంలో నేను ఆమరణ నిరాహార దీక్ష చేసి గ్రూప్ 1 పరీక్ష రద్దు చేయించడం జరిగిందన్నారు ఆయన.

ఈనెల 28వ తేదీన మద్రాస్ రబ్బర్ ఫ్యాక్టరీలో(ఎమ్ఆర్ఎఫ్) జరగబోయే కార్మిక సంఘాల ఎన్నికల్లో భాగంగా, ఈ రోజు డాక్టర్ బి.ఆర్. అంబెద్కర్ విగ్రహానికి పూలదండ వేసి నివాళులు అర్పించారు. ఈ కంపెనీ వద్ద బికెఎస్, కెపిఎస్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బిఎస్ పి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ప్రవీణ్ కుమార్  మాట్లాడారు.

పేపర్ లీక్ కావడంలో పబ్లిక్ సర్వీస్ కమీషన్ చైర్మెన్, సభ్యులే ఇందుకు కారకులున్నారు ఆయన. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావడానికి పోరాడి,త్యాగం చేసిన వారిలో కార్మికులు కూడా ఉన్నారన్నారు ప్రవీణ్ కుమార్. కానీ కార్మికులకు న్యాయం చేయడంలో ప్రభుత్వం విఫలం చెందిందన్నారు.

ఎమ్ఆర్ఎఫ్ కంపెనీ 25వేల కోట్ల టర్నోవర్ తో నడుస్తుందని, మెదక్ కంపెనీ 4 వేల కోట్ల లాభాలతో నడుస్తుంది.అందులో 99 శాతం పాత్ర కార్ముకులదే గుర్తు చేశారు బిఎస్ పి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ప్రవీణ్ కుమార్. కార్మికులకు కనీస వేతనం,ఎనిమిది గంటల పనివిధానం, మహిళలకు ప్రసూతి సెలవులు వంటి అనేక రకాల హక్కులు, ఇఎస్ఐ హక్కు కల్పించిన మహనీయుడు డా.బి ఆర్ అంబేడ్కర్ అని గుర్తు చేశారు ఆయన. అంబేడ్కర్ స్పూర్తితో ఏర్పడిన బహుజన్ సమాజ్ పార్టీ కార్మికుల హక్కుల కోసం పోరాడుతామని స్పష్టం చేశారు.

కార్మికులకు 52వేల నుండి 75 వేల వేతన ఒప్పందం కావాలంటే, సర్వీస్ అలవెన్స్ పై అగ్రిమెంట్ చేసుకోవాలంటే ,వైద్యపరమైన హక్కులు సాధించుకోవాలంటే, రిటైర్ మెంట్ బెనిఫిట్ సాధించుకోవాలంటే, రిటైర్మెంట్ వయస్సు పెంచుకోవాలంటే పులి గుర్తుకు ఓటేయాలని కోరారు బిఎస్ పి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ప్రవీణ్ కుమార్.

అందుకే కార్మికుల న్యాయమైన డిమాండ్లు నెరవేరాలంటే కేపిఎస్,బికెఎస్ కూటమిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు ఆయన. ఇతర రాజకీయనాయకులు లోపాయికారి ఒప్పందాలు చేసుకొని కంపెనీల నుండి కమీషన్లు తీసుకొని కార్మికులను మోసం చేస్తరనే విషయం గుర్తుంచుకోవాలన్నారు ఆయన.

Leave A Reply

Your email address will not be published.

Breaking