Take a fresh look at your lifestyle.

గూగుల్‌ మ్యాప్స్‌ తప్పిదం-ఎగ్జామ్ రాయలేని విద్యార్థి

0 179

గూగుల్‌ మ్యాప్స్‌ తప్పిదం – ఇంటర్‌ విద్యార్థికి శిక్ష

ఖమ్మం, మార్చి 15 :గూగుల్‌ మ్యాప్స్‌ను నమ్ముకుని ఓ ఇంటర్‌ విద్యార్థి నిలువునా మోసపోయాడు. తాను వెళ్లాల్సిన ఎగ్జామ్‌ సెంటర్‌కు బదులు తప్పుడు అడ్రస్‌కు డైరెక్షన్‌ చూపించడంతో సరైన సమయంలో ఎగ్జామ్‌ హాల్‌కు చేరలేకపోయాడు.

గూగుల్‌ తప్పిదాన్ని గుర్తించి పరీక్షా కేంద్రానికి వచ్చినా అప్పటికే ఆలస్యం కావడంతో తొలి రోజు పరీక్ష రాయలేక బాధతో వెనుదిరిగాడు. ఖమ్మం జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఖమ్మం రూరల్‌ మండలం కొండాపురం గ్రామానికి చెందిన విద్యార్థి వినయ్‌ ఇంటర్‌ చదువుతున్నాడు.

బుధవారం ఇంటర్‌ పరీక్షలు ప్రారంభం కావడంతో ఎగ్జామ్‌ హాలుకు వెళ్లేందుకు గూగుల్‌ మ్యాప్స్‌ను నమ్ముకున్నాడు. అందులో చూపించిన డైరెక్షన్‌లో వెళ్లాడు. అయితే తాను వెళ్లాల్సిన లొకేషన్‌కు కాకుండా మరో ప్లేస్‌కు గూగుల్‌ మ్యాప్స్‌ తీసుకెళ్లింది.

అక్కడ ఎగ్జామ్‌ సెంటర్‌ లేకపోవడంతో హడావుడిగా వేరేవాళ్లను అడ్రస్‌ అడుక్కుంటూ పరీక్షా కేంద్రానికి వచ్చాడు. ఈ క్రమంలో వినయ్‌ 27 నిమిషాలు ఆలస్యంగా ఎగ్జామ్‌ సెంటర్‌కు చేరుకున్నాడు. అయితే నిమిషం నిబంధనంగా కఠినంగా అమలు చేస్తుండటంతో వినయ్‌ను పరీక్షా కేంద్రంలోకి అనుమతించేందుకు సిబ్బంది నిరాకరించారు. దీంతో చేసేదేమీ లేక బాధతో ఇంటికి వెనుదిరిగాడు.

Leave A Reply

Your email address will not be published.

Breaking