Take a fresh look at your lifestyle.

తిరుపతి బస్సులకు మంచి స్పందన : ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి

0 503

టిఎస్ ఆర్టీసీ సంస్థ సేవలను ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలి

:టిఎస్ ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్

హైదరాబాద్, మార్చి 18 : టిఎస్ ఆర్టిసి సంస్థ సేవలను ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలన్నారు టీఎస్ ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్.  టిఎస్ఆర్టిసి – టిటిడి సంస్థ ఒప్పందంతో టిఎస్ ఆర్టిసి బస్సులలో ప్రయాణించే ప్రయాణికులకు టికెట్ తో పాటు 300 ₹ రూపాయల ప్రత్యేక శీగ్ర దర్శన టికెట్లను ప్రారంభించడంతో మంచి స్పందన వచ్చిందన్నారు.

ఎనిమిది నెలలలో  1,14,565 ప్రయాణికులను విజయవంతంగా తిరుమల తిరుపతి వెంకన్న వద్దకు సురక్షితంగా టిఎస్ఆర్టిసి బస్సులలో చేర్చడం చాలా సంతోషంగా, ఆనందంగా ఉందని సంస్థ చైర్మన్ వెల్లడించారు.

తిరుమలలో రోజు రోజుకు పెరుగుతున్న భక్తుల రద్దీ దృశ్య టిఎస్ ఆర్టీసీ సంస్థ వారి బస్సులను ఆశ్రయించి స్వామివారి దర్శనాన్ని సురక్షితంగా, సులభంగా చేసుకోవచ్చని ప్రయాణికులకు సూచించారు. ఈ బస్సుల కోసం వారం రోజుల ముందే రిజర్వేషన్ చేసుకోవాల్సి ఉంటుందన్నారు ఆయన.

తెలంగాణ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో తిరుమల వెంకన్న వద్దకు ఈ యొక్క ప్రత్యేక బస్సు సర్వీసులను ఏర్పాటు చేశామని చెప్పారు గోవర్ధన్. ప్రతిరోజు సుమారు 1000 మందిని తిరుమల వెంకన్న వద్దకు చేర్చడం జరుగుతుందన్నారు ఆయన. ఇందులో భాగంగానే అప్ అండ్ డౌన్ టికెట్ మరియు డౌన్ టికెట్ సౌకర్యంతో పాటు దర్శనం కూడా కల్పించడం జరుగుతుందన్నారు బాజిరెడ్డి.

టిఎస్ఆర్టిసి సంస్థ బస్సులలో ప్రయాణికులకు సురక్షితమైన, సుఖవంతమైన సౌకర్యాలను కల్పిస్తున్నామని చెప్పారు.

డైరెక్ట్ గా టీటీడీ వెబ్సైట్ ద్వారా దర్శనం చేసుకోవాలంటే సుమారు నెల రోజులు సమయం వేచి ఉండాల్సి వస్తుందన్నారు ఆయన. టిఎస్ ఆర్టిసి సంస్థ ప్రత్యేక బస్సు సర్వీసులలో బస్ టికెట్ తో పాటు 300 ₹ ప్రత్యేక శీగ్ర దర్శన టికెట్లను అందించడం జరుగుతుందని చెప్పారు.
టిఎస్ ఆర్టిసి సంస్థలో మెరుగైన వసతులతో పాటు ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చుతామని చెప్పారు.

తిరుమల శ్రీవారి దర్శనం కోసం వెళ్లే ప్రయాణికులకు టిఎస్ఆర్టిసి సంస్థ వారి ప్రీమియం బస్సులను ఏర్పాటు చేశామని చెప్పారు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి దయ దక్షణాలతో మరియు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారి సహకారంతో టిఎస్ఆర్టిసి సంస్థ మరింత పురోగతి సాధిస్తుంది.

టిఎస్ ఆర్టిసి సంస్థను కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్కరిది అని, టిఎస్ ఆర్టిసి ప్రవేశపెడుతున్న ప్రత్యేక బస్సు సౌకర్యాలను ప్రజలందరూ వినియోగించుకోవాలని చెప్పారు.

తిరుమల తిరుపతి వెంకన్న చెంతకు వెళ్లే భక్తులు మరిన్ని వివరాల కోసం టిఎస్ఆర్టిసి అఫీషియల్ వెబ్సైట్ను సందర్శించాలని చెప్పారు.
www.tsrtconline.in ఆన్లైన్ లేదా టికెట్ బుకింగ్ కౌంటర్లలో ఈ ప్యాకేజీ పొందవచ్చు కనీసం 7 రోజుల ముందుగానే ఈ యొక్క ప్యాకేజీని పొందవచ్చు అని తెలియజేశారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking