Take a fresh look at your lifestyle.

వరంగల్ జిల్లాలో సమస్యలతో పోలీసుల వద్దకు..

0 11

పోలీసులు పట్టించుకోకుంటే..

వరంగల్ పోలీసు కమీషనర్ కు ఫిర్యాదు చేయాలి

వరంగల్, మే 7 : వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయములో నిర్వహిస్తున్న పోలీస్ ప్రజావాణికి విశేష స్పందన రావడంతో పాటు పెద్ద సంఖ్యలో ఫిర్యాదుదారులు తమ ఫిర్యాదులను ప్రజావాణి కార్యక్రమం ద్వారా పోలీస్ కమిషనర్కు అందజేయడం జరుగుతోంది. దీనితో పోలీస్ ప్రజావాణి రోజున కేవలం 30 నుండి 40 వరకు ఫిర్యాదులను మాత్రమే పరిశీలించబడుతున్నాయి. మిగిలిన ఫిర్యాదులు పెండింగ్లో పడుతున్నాయి. ఇప్పటి వరకు ఫిర్యాదుదారులు అందించిన ఫిర్యాదుల్లో మూడు వేలకుపైగా ఫిర్యాదులు పెండింగ్లో వున్నాయి. ఈ పెండింగ్లో ఫిర్యాదులను క్రమబద్ధీకరణ చేసేందుకుగాను పోలీస్ కమిషనర్ ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతోంది.

ఇందులో భాగంగా ముందుగా పెండింగ్ లో వున్న ఫిర్యాదుల్లో అత్యవసరమైనవి అనగా స్థానిక పోలీసులు తమ ఫిర్యాదులపై తగు చర్యలు తీసుకోకున్న, స్థానికంగా పరపతి కలిగిన వ్యక్తుల నుండి ఇబ్బందులకు గురౌవుతున్న, పోలీసులు తప్పుడు కేసులు నమోదు చేసినట్లు వచ్చిన ఫిర్యాదులకు మొదటగా ప్రాధాన్యత కల్పిస్తూ ఈ ఫిర్యాదులు అందించిన ఫిర్యాదుదారులకు వరుస క్రమంలో పోలీస్ కమిషనరేట్ కార్యాలయం నుండి ఫోన్ ద్వారా సమాచారం అందించడం జరుగుతుంది. సమాచారం అందుకున్న ఫిర్యాదుదారులకు సూచించిన తేదిలో మాత్రమే పోలీస్ కమిషనరేట్ కార్యాలయములో నిర్వహించే పోలీస్ ప్రజావాణికి హాజరయి .

నేరుగా పోలీస్ కమిషనరు ఫిర్యాదుదారులు తమ ఫిర్యాదులకు తెలిపేందుకు అవకాశం కల్పించబడుతుంది. ముఖ్యంగా ఫిర్యాదుదారులు తమ ఫిర్యాదులు తప్పనిసరిగా ముందుగా స్థానిక పోలీస్ స్టేషన్కు చెందిన ఎస్.హెచ్.ఓకు ఫిర్యాదు చేసుకోవాలని, ఎస్.హెచ్.ఓ స్థాయిలో ఫిర్యాదు దారునికి తగు న్యాయం జరగని ఎడల ఫిర్యాదుదారుల పిదప డివిజన్ పరిధిలోని ఏసిపి స్థాయి పోలీస్ అధికారి లేదా జోన్ పరిధిలోని డిసిపి స్థాయి పోలీస్ అధికారికి ఫిర్యాదు చేయాల్సి వుంటుందని. పోలీస్ కమిషనర్ జోక్యం అవసరం అయినటువంటి ఫిర్యాదులను ఫిర్యాదుదారులు 8712685294 వాట్సప్ నంబర్కు సమాచారం అందించాలని, అలాగే మీ ఫిర్యాదులపై పోలీస్ అధికారులు సరైన చర్యలు తీసుకోకున్న, ఏదైన అత్యవసరమైన ఫిర్యాదు. చేయాలనకునే ఫిర్యాదుదారులు సంక్షిప్త సమచారంతో వరంగల్ పోలీస్ కమిషనర్ నంబర్ 8712685100 కుగాని పరిపాలన విభాగం అదనపు డిసిపి సెల్నంబర్ 8712865000కు సంక్షిప్త మెసేజ్ చేయాలని పోలీస్ కమీషనర్ ఫిర్యాదుదారులకు సూచించారు.

ప్రజల వద్దకు పోలీస్ గ్రీవెన్స్ కార్యక్రమంలో భాగంగా మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్, డివిజన్ -స్థాయిలో ఏసిపీలు, జోన్ పరిధిలో డిసిపిలు ప్రతి సోమవారం నాడు పోలీస్ గ్రీవెన్స్ నిర్వహిస్తారు. ఈ కార్యక్రమములో తోలి సారిగా ప్రజల వద్దకు పోలీస్ గ్రీవెన్స్ కార్యక్రమాన్ని ఈ గురువారం 11వ తేదీన జనగాం జిల్లా కేంద్రంలోని వెస్ట్ జోన్ డిపిపి కార్యాలయములో ఏర్పాటు చేయబడింది. ఈ పోలీస్ ప్రజావాణిలో ఉదయం 11గంటల నుండి వరంగల్ పోలీస్ కమిషనర్ ఫిర్యాదుదారుల నుంచి ఫిర్యాదులను స్వీకరిస్తారని. ఈ అవకాశాన్ని జనగామ జిల్లా ప్రజలు వినియోగించుకోగలరని వరంగల్ పోలీస్ కమిషనర్ ఓ ప్రకటన
తెలియజేసారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking