ఎమ్మెల్యే సోదరుడి అరెస్టు
నిర్దేశం, సంగారెడ్డి:
పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సోదరుడు గూడెం మధుసూదన్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసారు. సంతోష్ సాండ్ అండ్ గ్రానైట్స్ ను నిబంధనలకు విరుద్ధంగా నడిపాడనే కారణంతో అయనను పటాన్ చెరు పోలీసులు అరెస్టు చేసారు.శుక్రవారం తెల్లవారుజామునే గూడెం మధు ఇంటికి చేరుకున్న పోలీసులు, అయననుఅదుపులో తీసుకుని పటాన్ చెరు పోలీస్ స్టేషన్ కు తరలించారు.
పటాన్ చెరు పోలీస్ స్టేషన్ ముందు ఉద్రిక్తత
శుక్రవారం ఉదయం పటాన్ చెరు పోలీసు స్టేషన్ ముందు ఉద్రిక్తత నెలకొంది.ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి సోదరుడు మధుసూదన్ రెడ్డిని వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తీసుకెళ్తుండగా బీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. పోలీస్ వాహనంపై దాడి చేసారు. కార్యకర్తల్ని నిలువరించి నేరుగా వైద్య పరీక్షల కోసం సంగారెడ్డి జిల్లా ఆస్పత్రికి పోలీసులు తీసుకెళ్లారు.