Take a fresh look at your lifestyle.

వరంగల్ లో నకిలీ విత్తనాల ముఠా గుట్టు రట్టు

0 16

వరంగల్ లో నకిలీ విత్తనాల ముఠా గుట్టు రట్టు

వరంగల్, జూన్ 8 : నకిలీ విత్తనాల తయారీదారులను ముఠా సభ్యులను వరంగల్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుండి సుమారు రెండు కోట్ల 11 లక్షలు విలువ గల నకిలీ విత్తనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నకిలీ విత్తనాలతో పాటు ఒక డీసీఎం ఒక కారులతో పాటు విత్తనాల తయారీ యంత్రాన్ని స్వాధీనం చేసుకున్నారు.

15మందిని అరెస్ట్ చేసిన పోలీసులు 21లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. నకిలీ విత్తనాల తయారు చేస్తున్న ముఠాలో మరొ ఇద్దరు పరారీలో ఉన్నట్లు పోలీస్ కమిషనర్ రంగనాథ్ తెలిపారు. రైతులను మోసం చేసిన నకిలీ ఎరువులు విత్తనాలు అమ్మకం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు పక్కా సమాచారంతో దాడులు చేశామని.. నిందితుల పై పీడీ యాక్ట్ పెడుతున్నామని తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking