Take a fresh look at your lifestyle.

గద్దరన్నా.. నీ పాటకు వందనాలు

0 20

నీ పాటకు వందనాలు
నీ దరువుకి వందనాలు

నీ పాట ~

నీ పాట ‘బక్క చిక్కిన తెలంగాణ బానిస బతుకుల కడుపుల్లో.. జీవం పోసి బండెనక బండి కట్టించి నిజాం నిరంకుశత్వానికి నిప్పు పెట్టించింది’

నీ పాట ‘తునికి ఆకు కల్లాల్లో బక్కచిక్కి, దొక్కలోత్తిన నా బాల్య జీవితానికి.. జీగంజై దొరల గడీల పునాదులు పెకిలించెందుకు జింకల పరుగెత్తించింది’

నీ పాట ‘తెలంగాణ విద్యార్థి లోకాన్ని పోరు బాటకై.. పొడుస్తున్న పొద్దు వలె దగ, దగ మండించి దండులై కదిలించింది’

నీ పాట ‘మా ముందు తరాకి, మా తరాన్ని, మా తరువాతి తరాన్ని అనుసందానం చేసింది’

నీ పాట ‘వందనాలు వందనాలమ్మో.. అంటూ పసి కూన మొదలు పండు ముసలి అవ్వలను కదిలించింది’

నీ పాట ‘నిష్క్రమించిన నీ పాటకు నింగీ, నేల నివాళులర్పిస్తున్నాయి’

నీ పాటకు వందనాలు
నీ దరువుకి వందనాలు
నీ దప్పుకు వందనాలు
నీ గజ్జెకు వందనాలు
నీ కర్రకు వందనాలు
నీ గొంగడికి వందనాలు
నీ ఎర్రజెండకు వందనాలు
నిను గన్న తల్లిదండ్రులకు,
నీకు విద్య బుద్దులు నేర్పిన గురువులకు
శతకోటి వందనాలు, శతకోటి వందనాలు

– శేరు పోశెట్టి, ఆర్మూర్.
77320 95009

Leave A Reply

Your email address will not be published.

Breaking