Take a fresh look at your lifestyle.

గవర్నర్ నోటా… తెలంగాణ అభివృద్ది మాట

0 91

మనసులో ఏమి ఉన్నా… కొన్ని సార్లు తప్పని పరిస్థితులు ఏర్పాడుతాయి. ఇగో.. అసెంబ్లీ సమావేశాలలో కూడా ఈ సీన్ అందరిని ఆకర్శించింది.  సీఎం కేసీఆర్ – గవర్నర్ తమిళిసై మధ్య పొలిటికల్ వార్ కొనసాగుతున్న విషయం విధితమే..

కేంద్రానికి ఎజెంట్ గా గవర్నర్ పని చేస్తోందని బహిరంగంగానే విమర్శలు గురిపించారు టీఆర్ఎస్ నేతలు.. అసెంబ్లీలో తీర్మాణాలు చేసినా గవర్నర్ తమిళిసై ఆమోదించలేరు.

అదే సందర్భంలో గవర్నర్ పర్యాటనలో  ఫోటోకాల్ కూడా పాటించలేని పరిస్థితి.. అసెంబ్లీ సమావేశాలకు రెండు రోజుల ముందు కూడా గవర్నర్ పై హైకొర్టుకు వెళ్లిన రాష్ట్ర ప్రభుత్వం ఆ తరువాత యూ టర్న్ చేసుకున్నారు.

కానీ.. ఈరోజు ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలలో అసక్తికరమైన సీన్ కనపించింది. గత అసెంబ్లీ సమావేశాలలో గవర్నర్ ను ఆహ్వనించకుండానే ముగించారు.

అయితే.. ఈ రోజు అసెంబ్లీలో గవర్నర్ తమిళిసై గారిని సీఎం కేసీఆర్ స్వయంగా ఆహ్వనించడం.. ఆ తరువాత గవర్నర్ తెలంగాణ ప్రభుత్వం రాసిచ్చిన స్పీచ్ ను అసెంబ్లీలో చదివారు.

ప్రజాస్వామ్యం అంటే ఇదెనెమో…? గవర్నర్ నోటా… తెలంగాణ అభివృద్ది మాట

దేశానికే ఆదర్శంగా తెలంగాణ రాష్ట్రం
గవర్నర్ తమిళిసై

హైదరాబాద్ : శుక్రవారం నాడు తెలంగాణ శాసనసభలో గవర్నర్ తమిళిసై ప్రసంగించారు. తెలంగాణ అభివృద్ధి దేశానికే రోల్ మోడల్ అని కొనియాడారు. సీఎం కేసీఆర్..ప్రజా ప్రతినిధుల కృషి ఎంతో ఉందన్నారు. దేశ చరిత్రలోనే తొలిసారి దళితబంధుని ప్రవేశపెట్టారన్నారు.

గవర్నర్ ప్రసంగిస్తూ హైదరాబాద్ నలువైపుల 4 సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణం, నిమ్స్లో అదనంగా మరో 2వేల పడకలు,  తెలంగాణలో గతంలో 3 మెడికల్ కాలేజీలు ఉంటే ఇప్పుడు 17కు పెంచుకున్నామని అన్నారు.  మరో 9 మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేస్తామన్నారు.

మిషన్ భగీరథతో ఇంటింటికి తాగునీరు అందించాం. రాష్ట్రం ఏర్పడగానే ఎస్టీ రిజర్వేషన్లను 10 శాతానికి పెంచాం.. తండాలను గ్రామపంచాయతీలుగా మార్చాం.,. వృద్యాప్య పెన్షన్ వయసును 57ఏళ్లకి తగ్గించామన్నారు. తలసరి ఆదాయం రూ.3,17,115కి పెరిగిందన్నారు.మూడున్నరేళ్లలోనే కాళేశ్వరం ప్రాజెక్ట్ పూర్తయిందన్నారు.

మా ప్రభుత్వం ఎన్నో సవాళ్ళను అధిగమించింది. రైతు సంక్షేమానికి మా ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంది. రాష్ట్రంలో ఫ్లోరైడ్ సమస్య లేకుండా చేశాం. ప్రతి ఇంటికి మంచి నీరు అందిస్తున్నాం. రాష్ట్రంలో నాణ్యమైన విద్యుత్ 24 గంటలు అందిస్తున్నాం. రైతు పండించే ప్రతి బియ్యపు గింజను కొంటున్నాం. పేదలను ఆసరా పెన్షన్ తో అదుకుంటున్నాం. మిషన్ కాకతీయ ద్వారా చెరువులను పునరుద్దించుకున్నామని అన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking