Take a fresh look at your lifestyle.

జైల్ నుంచి ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ కు మరో లేఖ..

0 10

జైల్ నుంచి ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ కు

మరో లేఖ రాసిన సుఖేష్ చంద్రశేఖర్

ఢిల్లీ, మే 6 : మండోలి జైలు నుంచి మరో లేక రిలీజ్ చేసారు సుఖేష్ చంద్రశేఖర్. ఈసారి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్ ను ఉద్దేశించి  తన న్యాయవాది అనంత మాలిక్ ద్వారా లేఖ విడుదల చేసారు ఆయన. అరవింద్ కేజ్రీవాల్ నివాసానికి సంబంధించి విలువైన ఫర్నిచర్ పై విచారణ చేయాలని కోరారు సుఖేష్ చంద్రశేఖర్. వాట్సాప్, ఫేస్ టైం చాట్లలో,  తాను పంపించిన ఫోటోలు ఆధారంగా ఫర్నిచర్ అరవింద్ కేజ్రీవాల్, సత్యేంద్ర జైన్ ఫర్నిచర్ కొనుగోలు చేశారని పేర్కొన్నారు ఆయన.

అరవింద్ కొనుగోలు చేసిన ఫర్నిచర్ వివరాలు…

45 లక్షల విలువైన డైనింగ్ టేబుల్

34 లక్షల విలువైన డ్రెస్సింగ్ టేబుల్స్

18 లక్షల విలువైన అద్దాలు

28 లక్షలు విలువచేసే బెడ్ రూమ్ సామాగ్రి,

45 లక్షలు విలువచేసే వాల్ క్లాక్స్

వీటన్నిటినీ ఇటలీ, ఫ్రాన్స్ ముంబై నుంచి అరవింద్ కేజ్రివాల్  నివాసానికి  రిషబ్ శెట్టి తీసుకుని వెళ్లారని వివరించారు సుఖేష్ చంద్రశేఖర్. తాను గతంలో ఇన్విస్టిగేషన్ ఏజెన్సీకి ఇచ్చిన బిల్లుల తో పోల్చి ఫర్నిచర్ వాల్యుయేషన్ చేయాలని కోరుతున్నాను, వీటన్నిటిని పరిశీలిస్తే అరవింద్ కేజ్రీ వాల్ కు లగ్జరీ లైఫ్ పై ఎంత మక్కువ ఉందో అర్థం అవుతుంది.

కేవలం ఫర్నిచర్ కాకుండా వెండి పాత్రలు కూడా కావాలని కేజ్రివాల్  నన్ను కోరారు. 90 లక్షల విలువైన వెండి వస్తువులను  కేజ్రివాల్ కోసం నేను కొనుగోలు చేశాను. దక్షిణ భారతదేశానికి చెందిన ఒక ప్రముఖ బంగారపు షాపులో వస్తువులను కొనుగోలు చేశాను. కిక్ బ్యాక్ కరోల్ బాగ్ అనే ప్రాజెక్టు కింద ఈ వెండి వస్తువులను కొనుగోలు చేశాను. ఇందులో  15 వెండి భోజనం ప్లేట్లు, 20 గ్లాసులు, వెండి గిన్నెలు, స్పూన్లు, వెండి విగ్రహాలు కొనుగోలు చేశాను. నేను విడుదల చేసిన ఈ లేఖను ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ తో దర్యాప్తు చేయాలని కోరుతున్నాను అన్నారు సుఖేష్ చంద్రశేఖర్.

Leave A Reply

Your email address will not be published.

Breaking