Take a fresh look at your lifestyle.

దోస్త్ మేరా దోస్త్ తు హై మేరీ జాన్..

0 58

స్నేహమేరా జీవితం..

17న పూర్వ డిగ్రీ విద్యార్థుల కలియిక

ఓరేయ్.. కాలేజ్ కు ఇంత లేటా..? ఎందుకు ఆలస్యమైందిరా..? ఎగ్జామ్స్ కు బాగానే ప్రిపేర్ అయ్యావా..? రాంత్రంగా బాగానే చదివవా..? ఇంటి నుంచి ఖర్చులకు ఏమైనా పైసాల్ పంపిండ్రా..?  ఇగో.. ఇలాంటి ముచ్చట్లన్నీ విద్యార్థి దశలో కల్ముషం లేని మనసుతో ఫ్రెండ్స్ మాట్లాడుకుంటారు. ఆ చదువు పూర్తి కాగానే ఎక్కడెక్కడో ఏదో జాబ్ లో సెటిల్ అవుతారు. ఉరుకుల పరుగుల జీవితంలో పలుకరించడానికి కూడా టైమ్ దొరుకదు.

కానీ.. అప్పుడప్పుడు ఫంక్షన్ లోనో.. పెళ్లిలలోనో కలిసినప్పుడు ఫ్రెండ్స్ లో కనిపించే హృదయ స్పందన.. మరిచి పోయిన తియ్యని జ్ఞాపకాలు కళ్ల ముందు మెరుస్తాయి. బిజీ బిజీ లైఫ్ లో కూడా ఒకప్పుటి క్లాస్ మెంట్స్ అందరూ కలిస్తే భలేగా ఉంటుంది కదూ..

ఔను.. నిజామాబాద్ ప్రభుత్వ గిరిరాజ్ డిగ్రీ కాలేజ్ లో చదువుకున్న క్లాస్ మెంట్స్ నిజామాబాద్ నగరం బృందావన్ గార్డెన్ వద్ద హోటల్ క్రిష్ణాలో 17 డిసెంబర్ 2023న ఉదయం 11 గంటలకు  (Affiliated Friends) పూర్వ విద్యార్థులు కలుస్తున్నారు.  విద్యార్థి దశలో మంచి – చెడులను గుర్తు చేసుకుని యోగా క్షేమాలు తెలుసుకోవడానికి డాక్టర్ ఎం.ఏ. మాలిక్, చల్ల సత్యనారాయణ, సత్యశోధక్ నర్సయ్య, మహ్మద్ ఇబ్రహీం ఈ గెట్ గేదర్ ప్రోగ్రాం ఆర్గనైజ్ చేసారు.

మాలిక్.. గంగాధర్.. జీవన్ రెడ్డి.. మధు సూధన్.. వినోద్..  మధన్.. సత్యశోధక్ నర్సయ్య.. భూపతి.. రాజారాం.. శ్రీధర్.. దేవన్న.. చల్ల సత్య నారాయణ, సుధర్శన్.. సాయన్న.. నరహరి.. క్రిష్ణారెడ్డి.. సుధాకర్.. ఇగో వీళ్లంతా 1994 – 1997 వరకు నిజామాబాద్ ప్రభుత్వ గిరిరాజ్ డిగ్రీ కాలేజ్ లో చదివిన విద్యార్థులే. సోషలిజం, కమ్యూనిజం, బహుజనయిజం బ్యాక్ రౌండ్ తో విద్యార్థి దశలోనే పని చేసిన మాలిక్, గంగాధర్, రాజారాంల ప్రభావం తోటి ఫ్రెండ్స్ పై పడ్డది.

ఉస్మానియా యూనివర్సిటీలో పోస్ట్ గ్రాడ్యువేషన్ లో సీట్ సాధించాలనే ఏకైక లక్ష్యంతో చదివారు. కష్టపడి చదివినందుకు చాలా మందికి పీజీలో సీటు రావడం వారి జీవితాలలో టర్నింగ్ ఫాయింట్. డిగ్రీ చదువుతున్నప్పుడే వాళ్లంతా ‘‘లక్ష్యం’’తో ముందుకు కదిలారు.

ఆ గ్రూప్ లో చదువులో పోటీ పడేది మాలిక్, జీవన్ రెడ్డిలే. మాలిక్ అసిస్టెంట్ ప్రొఫెసర్ అయ్యారు. జీవన్ రెడ్డి రెండు మార్లు ఎమ్మెల్యే అయ్యారు. సర్కార్ జాబ్ కొట్టాలని పోటీ పరీక్షాలకు ప్రిపేర్ అయిన వినోద్ ఆర్డీవో (ఆర్మూర్), ఎం.గంగాధర్ (హైదరాబాద్ సిటీ), మధు సూధన్ ( నిజామాబాద్ ఇంటిలిజెన్స్) ఉన్నత పదవులలో ఉన్నారు. ఇగో ఈ ముగ్గురిని ఈ గెట్ గేదర్ మీట్ లో సన్మానం చేస్తున్నారు. మరోకరు మధన్ ఐఆర్ ఎస్ సాధించి నాగపూర్ లో ఇన్ కం టాక్స్ డిపార్ట్ మెంట్ లో అడిషనల్ కమీషనర్ గా కీలకమైన పదవిలో బిజీగా ఉన్నారు.

సక్సెస్ కు కారణం..?

నిజామాబాద్  ప్రభుత్వ గిరిరాజ్ డిగ్రీ కాలేజ్ లో చదివిన ఫ్రెండ్స్ ఒక్కోక్కరు ఒక్కో వృత్తిలో సెటిలయ్యారు. ఎవరికి వారే యమున తీరే అనే సందనంగా ఉన్నప్పటికీ భవిష్యత్ పై ఆశతో అందరు కష్టపడి చదువాలనే మెంటాల్టీ ఉండేది. మాలో పిడిఎస్ యు, బీఎస్ఎఫ్ బ్యాక్ రౌండ్ ఉండటంతో ప్రతి ఆంశాన్ని శాస్త్రీయ పద్దతిలో ఆలోచన చేసేవారం అంటున్నారు అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం.ఎ మాలిక్.

చదువుతున్నప్పుడే లక్ష్యం పెట్టుకుని గదిలో తాము సబ్జెక్ట్ పరంగా చర్చాలు చేసినప్పుడు ఎన్నో విషయాలపై అవగహన పెరిగిందంటున్నారు డీఎస్పీ ఎం. గంగాధర్. ఎన్ సీసీ సీ సర్టిఫెకెట్ సాధించిన తనకు పోలీసు శాఖలో జాబ్ చేయాలనేది ఫ్యాషన్ గా ఉండేదన్నారు ఆయన.


చదవులో వెనుక బడిన తాను హాస్టల్ వార్డెన్ గా ఎంపికై జాబ్ చేయడానికి కారణం  లెక్చరర్ నర్సింహరావుతో పాటు తోటి క్లాస్ మెంట్స్ మాలిక్, గంగాధర్, నర్సయ్య, శ్రీధర్ తదితరుల స్నేహం, వారి సూచనలు కారణమంటున్నారు నరహరి.

యాటకర్ల మల్లేష్,

Leave A Reply

Your email address will not be published.

Breaking