Take a fresh look at your lifestyle.

నాలుగో సింహమేరా పోలీస్.. ఎమర్జెన్సీ పేరుతో రాత్రింబవళ్లు డ్యూటీలు

0 17

నాలుగో సింహమేరా పోలీస్..

–     ఎమర్జెన్సీ పేరుతో రాత్రింబవళ్లు డ్యూటీలు

–     వినాయక నిమజ్జనం.. పోలీసులకు సవాలే..

–    సీసీ కెమెరాలతో ప్రత్యేక నిఘా

–  కమాండ్ కంట్రోల్ లో వివిధ శాఖల అధిపతులు

 ‘‘పోలీస్.. అంటే కనిపించే మూడు సింహాలు చట్టానికి, న్యాయానికి, ధర్మానికి ప్రతీక అయితే శాంతి, సామరస్యం నెల కొల్పడమేరా నాలుగో సింహం పోలీస్’’ ఇది సినిమా డైలాగ్ కావచ్చు..

పోలీస్.. ఈ పేరులోనే ఉంది పవర్.. ఖాకీ డ్రెస్ చూడగానే వారికి తెలియకుండానే రెస్పెక్ట్ ఇస్తారు పబ్లిక్. పోలీస్ అంటే కత్తి మీద సాములా విధులు నిర్వహించడమే. ఇందులో యూనిఫాంలో పని చేస్తున్న వారిలా సగభాగం ఇంటిలిజెన్స్ వ్యవస్థ కూడా కీలకంగా పని చేస్తుంది. అసాంఘీక కార్యక్రమాలు జరుగకుండా ఇంటిలిజెన్స్ వింగ్ పని చేస్తుంది. మతకలహాలపై ప్రత్యేకంగా దృష్టి, మసీదు, దేవాలయాల వద్ద ప్ర్యతేక నిఘా ఉంటుంది. మతకలహాలు సృష్టించే వ్యక్తులను గుర్తించి ముందుగా బైండోవర్ చేయడంలో ఇంటిలిజెన్స్ వ్యవస్థ కీలకంగా పని చేస్తుంది.

 

పోలీస్.. మీకు సెల్యూట్..

శాంతి భద్రతల పరిరక్షణ కోసం పోలీసు వ్యవస్థలోని అన్నీ సెక్షన్ లు విధులు నిర్వహిస్తుంటాయి. తీవ్రవాదుల కదలికలు.. నక్సలైట్ కార్యకలపాలు.. మతకలహాలు.. గ్రూప్ రాజకీయ గొడవలు.. ఒక్క మాటలో చెప్పాలంటే వివాదాలు జరుగకుండా విధులు నిర్వహించేది పోలీసు వ్యవస్థనే. కొట్లాట జరిగినా.. చంపుకుని చచ్చినా.. హత్యలు చేసినా.. చివరకు మినిష్టర్ ప్రోగ్రాం ఉన్నా పోలీసులు అలర్ట్ గా ఉండాల్సిందే. పోలీసు సెక్యూర్టీ లేకుండా నాయకులు అడుగు ముందుకు వేయలేని పరిస్థితులు.. అందుకే ‘పోలీస్.. మీకు సెల్యూట్..’ అని చెప్పాల్సిందే అంటున్నారు కామన్ పబ్లిక్.

 

వినాయకుడి నిమజ్జనం పోలీసులకు సవాలే..

హైదరాబాద్ నగరంలో వినాయకుడి నిమజ్జనం పోలీసులకు సవాల్ లాంటిదే. శాంతి భద్రతల సమస్య ఏ రూపంలో ఉత్పన్నం అవుతుందో తెలుసుకోవడం ఇంటిలిజెన్స్, స్పెషల్ బ్రాంచ్ పోలీసు వింగ్ లు రాత్రింబవళ్లు కష్ట పడాల్సి ఉంటుంది. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలోని కొన్ని ప్రాంతాలలో మైనార్టీలు అధిక సంఖ్యలో ఉన్నారు. ఆ ప్రాంతంలో హిందువులు వినాయకుడిని నెలకొల్పి పూజలు నిర్వహించేటప్పుడు హిందూ – ముస్లీం భాయ్ భాయ్ అంటూ వారిని కంటికి రెప్పలా నిఘా పెట్టి పోలీసులు విధులు నిర్వహిస్తారు. వినాయకుడి నిమజ్జనం సందర్భంగా ఊరేగింపుగా వెళుతుంటే పోలీసులకు కంటి మీద నిద్ర ఉండదు. ప్రశాంతంగా వినాయకుల నిమజ్జనం జరుగాలని పోలీసు ఉన్నతాధికారులు సైతం ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండి పర్యవేక్షిస్తుంటారు. వినాయక నిమజ్జనం సందర్భంగా ప్రత్యేకంగా హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమీషనరేట్ ప్రాంతాలలో ప్రత్యేకంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పోలీసు ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తున్నారు.

సీపీ సీవీ ఆనంద్ చొరవతో…

హైదరాబాద్ పోలీసు కమీషనర్ సీవీ ఆనంద్ ప్రత్యేక చొరవను పలువురు అభినందిస్తున్నారు. ఈ నెల 28న వినాయక నిమజ్జన శోభయాత్ర, మిలాద్-ఉన్-నబీ వేడుకలు ఒకే రోజున నిర్వహించనున్న నేపథ్యంలో హిందు- ముస్లీంల మధ్య గొడవలు జరిగే అవకాశం ఉన్నట్లుగా భావించిన హైదరాబాద్ పోలీసు కమీషనర్ సీవీ ఆనంద్ ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. లోకల్ గా విద్యనభ్యసించడం, క్రీడకారుడిగా ప్రత్యేక గుర్తింపు, పోలీసు అధికారిగా అన్నీ వర్గాలతో ముందే సంబంధాలు ఉండటం అతనికి కలిసొచ్చిన ఆంశాలు. దీంతో ముస్లీం మత పెద్దలతో సీపీ సీవీ ఆనంద్ జరిపిన చర్చలు సఫలమయ్యాయి. శాంతి కమిటీలతో సమావేశాలు నిర్వహించిన ఆయన మత పెద్దలకు నచ్చ చెప్పారు. దీంతో మిలాద్-ఉన్-నబీ వేడుకలను అక్టోబర్ 1వ తేదీకి వాయిదా వేసుకున్నారు మత పెద్దలు. ఈ నెల 28వ తీదీన వినాయకుడి నిమజ్జనం ఉన్నందున పెద్ద మనసుతో ముస్లీ మత పెద్దలు తీసుకున్న నిర్ణయం పట్ల సంతోషం వ్యక్తం చేశారు సీపీ సీవీ ఆనంద్.

సీపీ సీవీ ఆనంద్ ను స్ఫూర్తిగా..

అయితే.. హైదరాబాద్ పోలీసు కమీషనర్ సీవీ ఆనంద్ ను స్టేట్ లోని నిజామాబాద్, వరంగల్, సిద్దిపేట్, కరీంనగర్, రామగుండం పోలీసు కమీషనర్ లు  స్ఫూర్తిగా తీసుకున్నారు. 28న  వినాయకుడి నిమజ్జనం రోజున జరిగే మిలాద్-ఉన్-నబీ వేడుకలను వాయిదా వేసుకోవాలని ముస్లీం మత పెద్దలను కోరారు సీపీలు. ఇదిలావుండగా నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ లో హెచ్ఎండీఏ, జీహెచ్ ఎంసీ, ఎక్సైజ్, ఫారెస్ట్, వాటర్  వర్క్ లాంటి ముఖ్యమైన శాఖల అధిపతులు తప్పని సరిగా ఉండాలని డీజీ ర్యాంక్ లో సీవీ ఆనంద్ ఆదేశాలు జారీ చేశారు.

  • యాటకర్ల మల్లేష్, జర్నలిస్ట్

Leave A Reply

Your email address will not be published.

Breaking