Take a fresh look at your lifestyle.

జర్నలిస్ట్ ల ల్యాండ్ లో మాజీ నక్సలైట్ కబ్జా

0 395

హైదరాబాద్ మహానగరంలో గజం జాగ ఉంటే చాలు మాఫీయా ముఠా రెక్కలు  కట్టుకుని వాలుతుంటాయి. పొలిటికల్ లీడరులు… రౌటీ షీటర్లు.. మాజీ నక్సలైట్లు.. హంతకులు ఇలా ఎవరికి వారే కోట్ల రూపాయల విలువ గల భూములను కబ్జా చేస్తున్నారు. అక్రమంగా ల్యాండ్ కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాల్సిన అధికారులు డబ్బులకు అమ్ముడు పోయి కళ్లుండి చూడాలేని అంధులుగా మిగిలి పోతున్నారు.

ఇగోె.. ఈ ల్యాండ్ కథ కూడా అలాంటిదే.. హైదరాబాద్ నగరం పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ కు కూత పెట్టు దూరంలో ల్యాండ్. వైఎస్ ఆర్ ప్రభుత్వం అప్పట్లో జర్నలిస్ట్ లకు ఈ ల్యాండ్ కెటాయించారు. కానీ.. కోర్టులోకి ఈ కేసు వెళ్లడంతో ఆ ల్యాండ్ కోసం జర్నలిస్టులు నిరిక్షిస్తున్నారు. ఇటీవల సుప్రీం కో్ర్టు జర్నలిస్ట్ లకు ప్లాట్లు ఇవ్వచ్చాని తీర్పు చెప్పడంతో జర్నలిస్టులలో కొత్త ఆశలు చిగురించాయి.

మాజీ నక్సలైట్ కబ్జా..

జర్నలిస్టులకు కెటాయించిన ల్యాండ్ లో సదాశివ్ నగర్ మండలంకు చెందిన మాజీ నక్సలైట్ మానేటి శ్రీనివాస్ అలియాస్ తుపాకీ శీను (గన్ శీను) ఐదు ఎకరాలలో కబ్జా చేసుకుని ఉంటున్నారని కర్రోల్ల శ్రీనివాస్ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఆ ల్యాండ్ లో ప్లాట్స్ గా మరి కొందరికి విక్రయించాడని చెబుతున్నారు. అయితే.. ప్లాట్ ల పేరుతో శీను చేసేది మోసం అని తెలిసిన తాను ఇచ్చిన 650000 ( అక్ష,రాల ఆరు లక్షల యాభై వేల రూపాయలు) తిరిగి ఇవ్వాలని తుపాకీ శీనుకు అడిగితే ఇవ్వడం లేదని.. ఇప్పటికే  రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్, జీహెచ్ ఎంసీ కమీషనర్, హెచ్ ఎండిఎ కమీషనర్, జిల్లా కలెక్టర్, ఆర్ డివో, ఎమ్మార్వోలకు రాత పూర్వకంగా ఫీర్యాదు చేశానన్నారు కొంపల్లికి చెందిన కర్రొల్ల శ్రీనివాస్.

కర్రొల్ల శ్రీనివాస్ చేసిన ఫిర్యాదు ఇదే..

శ్రీయుత గౌరవనీయులైన కే. తారక రామారావు, మున్సిపల్ శా ఖ మంత్రి వర్యులు గారికి,

అయ్యా!

మీకు ఒక ముఖ్యవిషయం తెలియ చేయాలన్న ఆశతో మీరు తొందరగా చర్యలు తీసుకుంటు న్నారన్న నమ్మకంతో మీకు విజ్ఞప్తి చేసుకుంటున్నాను.

విషయం: పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పుక్కన గల సర్వే నెం: 25/1. 25/2 గల భూమిని దిదేవు ఐదు ఎకరాలు వరకు మానేటి శ్రీనివాస్ ఆలియాస్ తుపాకి శ్రీను (గన్ శ్రీను అనే రౌడీ మాజీ నక్సలైట్ ఆక్రమించుకొని ఈ భూమిలో మూడూ ఇండ్లు నిర్మించుకొని, ఒక దాంట్లో నివసిస్తున్నాడు.

విద్యుదృక్తి శాఖ లోని ఆధికారులకు లంచాలు ఇచ్చి ఇండ్లు, మనుషులు లేకున్నా 12 కరెంటు మెంటర్లు ఇండ్లు ఉన్నట్లుగా తీసుకున్నాడు. ఆ భూమిలో నాల్గు బోర్లు వేసి వాటికి మీటర్లు కుడా తీసుకొని కరెంటు మీటర్లు పెట్టినారు. అక్కడ ఎవ్వరూ లేకున్నా వాడికి తెలిసిన, మరియు భందువుల పేర్ల మీద 15 మం ది ఆధార్ కార్డులు కూడా చేయించిన్నాడు. ఇదే అడస్ మీది గ్యాస్ కనెక్షన్ దాదాపు 12 వరకు తీసుకు న్నాడు.

రెవిన్యూ ఆదికారులు వచ్చి ఈ భూమి గవర్నమెంటుది అని చెప్పి వాడు వేసిన బౌండరి కంచెను తీసి వేసినారు. అయితే ఆధికారులకు డబ్బులు ఇచ్చి మళ్ళీ కంటే వేసినాడు. సర్వే నెం 25/14 25/2 గల భూమిని చూపిస్తూ నా దగ్గర ప్లాట్లు ఇస్తానని 6,50000 రూ॥ అక్షరాలు: ఆరు లక్షల రూపా కాయిలు) 2015 లో తీసుకున్నాడు.

ఈ భూమిని చూపిస్తూ చాలా మంది దగ్గర కోట్లు రూపాయిలు వసూల్ చేసాడు. ఫ్లాట్లు ఇస్మానని ఈ విషయంలో మేము డబ్బులు అడిగితే తుపాకీ చూపించి బెదిరి స్తున్నాడు. దీని పరిధిలో గల పోలీస్ స్టేషన్ పేట్ బషీరాబాద్ కు వెళ్ళితే SHO స్థాయి ఆధికారులను ASP స్థాయి ఆదికారులతో ఫోన్ చేయించి మేనేజ్ చేస్తున్నాడు. మేము పోలిస్ స్టేషన్ కు వెళ్ళి న వాళ్ళు పట్టించుకోవడం లేదు. కావున దయచేసి తగిన చర్యలు తీసుకొని మాకు న్యాయం చేయగలరని ప్రార్ధిస్తున్నాము.

ఇంకా మీకు ఒక ముఖ్య విషయం తేలియచేస్తున్నాము. వీడు వాని పేరు మీద మరియు బందుమిత్రుల పేరు మీద 58, 59 జి.ఓ కింద డబ్బులు కూడా కట్టినాడు.

నోటు: మానేటి శ్రీనివాస్ అనే వ్యక్తి మా దగ్గర 2015 లో డబ్బులు తీసుకోని 25/4, 25/2, కొంత సర్వే నెంబర్ తో మాకు కాకుండా వేరే వారికి అక్కడ లేనివారికి 58. 59 జీ.తో క్రింద డబ్బులు కట్టినా డు. మీరు వేరిఫికేషన్ చేసి మాకు న్యాయం చేయగలరని ప్రార్ధిస్తున్నాను.

ఇట్లు

కర్రొల్ల శ్రీనివాస్

కొంపల్లి ప్రజయ్ గృహతార అపార్ట్ మెంట్

9885490241

 

Leave A Reply

Your email address will not be published.

Breaking