Take a fresh look at your lifestyle.

తెలంగాణలో మత్స్యరంగం అభివృద్ధికి

0 97

అద్భుత అవకాశాలు
– పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ విజయ్ గుప్తా

తెలంగాణ మత్స్యరంగాన్ని అభివృద్ధి పరిచేందుకు అందుబాటులో ఉన్న అవకాశాలన్నింటినీ వినియోగించుకోవాలని, తద్వారా చేపలు ఉత్పత్తిలో ఉత్పత్తి, ఉత్పాదకతలను ఇతోధికంగా పెంచడంతోపాటుగా ఉపాధి అవకాశాలు కూడా గణనీయంగా పెంచగలమని “పద్మశ్రీ” అవార్డు గ్రహీత, అంతర్జాతీయ మత్స్యరంగం నిపుణులు డాక్టర్ మోదుగు విజయ్ గుప్తా అన్నారు.

దేశంలో మొట్టమొదటిసారి ఒక మత్స్యరంగం నిపుణుడిగా కేంద్రప్రభుత్వం డాక్టర్ మోదడుగు విజయ్ గుప్తాకు “పద్మశ్రీ” గౌరవ పురస్కారాన్ని ప్రకటించిన సందర్భంగా ఎమ్మెల్సీ డాక్టర్ బండా ప్రకాశ్ ముదిరాజ్ నాయకత్వంలోని “తెలంగాణ ముదిరాజ్ మహాసభ” ప్రతినిధివర్గం ఆయనను కలిసి ఘనంగా సత్కరించారు.

ఈ సందర్భంగా”పద్మశ్రీ” అవార్డు గ్రహీత, అంతర్జాతీయ మత్స్యరంగం నిపుణులు డాక్టర్ మోదుగు విజయ్ గుప్తా  మాట్లాడుతూ గోదావరి నదికి అనుసంధానంగా కాళేశ్వరం ఎత్తిపోతల పథకాలలో భాగంగా నిర్మించిన నీటిపారుదల ప్రాజెక్టులు, వాటికి అనుగుణంగా నిర్మించిన రిజర్వాయర్ల ఫలితంగా రాష్ట్రంలో నీటి వనరులు విస్తీర్ణం గణనీయంగా పెరిగిందని, తదనుగుణంగా చేపలు ఉత్పత్తిని, ఉత్పాదకతలను పెంచుకునేందుకు అవకాశాలు మెరుగుపడ్డాయని ఆయన అన్నారు.

రాష్ర్టంలో పెరిగిన నీటివనరులను గరిష్టంగా వినియోగించుకుని మతైస్యరంగాన్ని ఇతోధికంగా అభివృద్ధి పరిచేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన చర్యలను తీసుకుంటున్నదని ఎమ్మెల్సీ డాక్టర్ బండా ప్రకాశ్ ముదిరాజ్ ఈ సందర్భంగా వివరించారు. రాష్ర్టంలో పెరుగుతున్న మత్స్యకారుల సంఖ్యకు అనుగుణంగా మత్స్యకార సొసైటీలను పెంచేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నదని, మత్స్యసొసైటీల ద్వారా గడచిన ఆరు సంవత్సరాలుగా ఉచిత చేపపిల్లలను పంపిణీ చేసే పథకాన్ని కొనసాగిస్తున్నదని ఆయన తెలిపారు.

రాష్ర్టంలోని మత్స్యకారులందరికీ దశలవారీగా నిరంతరం శిక్షణాకార్యక్రమాలను నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, రాష్ర్టంలో చేపలు ఆహారం వినియోగాన్ని అంతర్జాతీయ స్థాయికి పెంపొందించేందుకు వీలుగా, జనావాసాలలో చేపల విక్రయాలను అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలను తీసుకునే ఆలోచన ఉన్నట్లు డాక్టర్ బండా ప్రకాశ్ ముదిరాజ్ వివరించారు.

పద్మశ్రీ అవార్డుకు మత్స్యరంగానికి చెందిన డాక్టర్ మోదడుగు విజయ్ గుప్తా ఎంపికైన సందర్భంగా ఆయనను సన్మానించిన “తెలంగాణ ముదిరాజ్ మహాసభ” ప్రతినిధుల బృందంలో డాక్టర్ బండా ప్రకాశ్ ముదిరాజ్ తొ పాటు తెలంగాణ మత్స్యరంగం నిపుణులు పిట్టల రవీందర్, మహాసభ నాయకులు డాక్టర్ గుండ్లపల్లి శ్రీను ముదిరాజ్, బిల్లు సత్తయ్య, బొక్కా శ్రీనివాస్, గొడుగు శ్రీనివాస్ ముదిరాజ్ తదితరులు కూడా పాల్గొన్నారు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking