Take a fresh look at your lifestyle.

బడ్జెట్ అంతా సెల్ఫ్ డబ్బా.. విమర్శలు, గొప్పలకే ప్రసంగంలో ప్రాధాన్యం

భట్టి ప్రసంగంలో ఎక్కువసార్లు త్వరలో అనే మాట వినిపించడం గమనార్హం. ప్రభుత్వ అంచనాలను పక్కాగా అమలు చేస్తామనే మాట భట్టి నేరుగా చెప్పలేకపోయారు.

0 79

నిర్దేశం, హైదరాబాద్: గురువారం రాష్ట్ర అసెంబ్లీలో భట్టి విక్రమార్క వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టారు. అయితే ఈ ప్రసంగంలో కేటాయింపుల వివరాలు, ప్రజల అవసరాలు తీర్చే విషయాలు చెప్పడానికంటే ఎక్కువ ప్రాధాన్యం.. గత ప్రభుత్వాన్ని విమర్శించేందుకు, తమ గొప్పలు చెప్పుకునేందుకు ప్రసంగించినట్లే సాగింది. కొన్ని కీలకమైన ప్రకటనల సమయంలోనో లేదంటే ప్రసంగం ప్రారంభంలో, చివరలోనో గత ప్రభుత్వం గురించి ప్రస్తావిస్తే వేరు కానీ, ప్రతి సందర్భంలో కేసీఆర్ సహా గత బీఆర్ఎస్ ప్రభుత్వం గురించి భట్టి ప్రస్తావిస్తూ వచ్చారు.

దేశ తొలి ప్రధాని జవహార్ లాల్ నెహ్రూ నుంచి నేటి రాహుల్ గాంధీ వరకు గాంధీ కుటుంబ నేతలను పదే పదే ప్రస్తావించారు. గాంధీ కుటుంబం లేకపోతే ఈ దేశంలో ఎవరికీ అన్నమే దొరకలేదన్నట్టుగానే బడ్జెట్ ప్రసంగంలో భట్టి వ్యాఖ్యానించడం శోచనీయం. మాటకు ముందు ఇందిరా, తర్వాత రాజీవ్ గాంధీ అంటూ సాగింది ప్రసంగం. బడ్జెట్ అంచనాలు, కేటాయింపులు, వాటి ప్రయోజనాల కంటే బీఆర్ఎస్ తప్పులు, కాంగ్రెస్ గొప్పలకే బడ్జెట్ లో ఎక్కువ ప్రాధాన్యత లభించింది. ఇక, భట్టి ప్రసంగంలో ఎక్కువసార్లు త్వరలో అనే మాట వినిపించడం గమనార్హం. ప్రభుత్వ అంచనాలను పక్కాగా అమలు చేస్తామనే మాట భట్టి నేరుగా చెప్పలేకపోయారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking