Take a fresh look at your lifestyle.

ఎమ్మెల్యే రాజయ్యపై మహిళా సర్పంచ్ ఫైర్

0 248

ఎమ్మెల్యే రాజయ్యపై మహిళా సర్పంచ్ ఫైర్

హన్మకొండ, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే రాజయ్యపై మహిళా సర్పంచ్ తీవ్ర ఆరోపణలు చేయడం ఆటు పార్టీలో, ఇటు జిల్లాలో కలకలం రేపింది. ఎమ్మెల్యే తనకు పార్టీలో తగిన గుర్తింపు, గౌరవం ఇవ్వకుండా వేధిస్తున్నారని ఆరోపించింది. ఎమ్మెల్యే, అనుచరులు చేసే తప్పుడు పనులవల్ల బీఆర్ఎస్ పార్టీకి, ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని ఆవేదన వ్యక్తం చేసింది.

ఓట్లు వేసిన ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు తగిన విలువ ఇవ్వడంలేదని విమర్శించింది. చేసిన పనులకు బిల్లులు రాక ఒంటిపై బంగారం, ఆస్తులు అమ్ముకున్నామని ధర్మసాగర్ మండలం జానకిపురం సర్పంచ్ కుర్చపల్లి నవ్య దంపతులు అంటున్నారు.

పసిపిల్లల పట్ల కూడా అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. చిన్న పిల్లల చుట్టూ సొల్లు కార్చుకుంటూ తిరుగుతున్నారు. సోషల్ డిస్టెన్స్ లేకుండా అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. మీకు, అక్కా చెళ్లెళ్లు లేరా అని నిలదీసారు. నేను కేసీఆర్, కేటీఆర్ వరకూ వెళ్తాను సొంతపార్టీ నేతలపై మహిళా సర్పంచ్ ఆగ్రహం వ్యక్తం చేసింది.

Leave A Reply

Your email address will not be published.

Breaking